హవ్వా.. ఇంత చిన్న కారణానికి.. ఎవరైనా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారా?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి విషయంలో యువతి యువకులు ఇద్దరు కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం మ్యారేజ్ అనేది కేవలం ఒక కమర్షియల్ ఎలిమెంట్గా మాత్రమే మారిపోయింది అని చెప్పాలి. ఇది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. బాగా డబ్బున్న వాడు దొరికితే బాగుండు అని అమ్మాయిలు.. ఇక డబ్బున్న అత్తమామలు దొరికి భారీగా కట్నకానుకలు ముట్ట చెప్తే బాగుండని అబ్బాయిలు కమర్షియల్ గా ఆలోచిస్తూ ఉన్నారు.



 ఈ క్రమంలోనే అందం మంచి మనసు చూడటం లేదు. ఇక కమర్షియల్ గా వారికి నచ్చిన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవారు దొరికితే చాలు ఓకే చెప్పేస్తూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాము. అదే సమయంలో ఇక నేటి రోజుల్లో పెళ్లి క్యాన్సిల్ అవుతున్న ఘటనలు కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయ్. వింతైన కారణాలతో ఎంతోమంది ఇక ముహూర్తం చివరి నిమిషంలో పెళ్లిలను క్యాన్సల్ చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇలాంటి కారణానికి కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.



 ఇంతకీ ఏం జరిగిందో తెలుసా.. వరుడు ప్రధాని నరేంద్ర మోడీ పేరు చెప్పలేదు అన్న కారణంతో పెళ్లి రద్దు చేసుకుంది వధువు. ఈ వింతైన ఘటన యూపీలోని ఘాజీపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వరుడు శివశంకర్కు తెలివి లేదని బంధువులు హేళన చేశారు. అయితే కనీసం ప్రధానమంత్రి ఎవరు అని అడిగితే కూడా చెప్పలేకపోయాడు శివశంకర్. దీంతో వధువు రంజన పెళ్లి క్యాన్సిల్ అంటూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ వెంటనే పెళ్లి కొడుకు తమ్ముడు అనంత్ తనకంటే వయసులో చిన్నవాడు అని తెలిసినప్పటికీ రంజన అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే తమను భయపెట్టి అనంత్ ను బలవంతంగా పెళ్లి చేసుకుంది అంటూ శివశంకర్ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: