ఫేషియల్ కోసం బయటికి వెళ్లి.. ట్విస్ట్ ఇచ్చిన వరుడు?

praveen
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెళ్లి విషయంలో యువతీ యువకులు అందరూ కూడా ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక జీవితాంతం సంతోషంగా చూసుకుంటారు. బాగా అర్థం చేసుకుంటారు.. అని నమ్మకం ఉన్న భాగస్వామినే జీవితంలోకి ఆహ్వానించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో పెళ్లి బంధానికి అర్ధాన్ని మార్చేస్తున్నారు యువతీ యువకులు.

 ఒకప్పుడు సినిమాల్లో చూపించినట్లుగా కాదు ఇక ఇప్పుడు అంతకుమించి అనే రేంజ్ లోనే ప్రవర్తిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఒకప్పుడు సరిగ్గా ముహూర్తం సమయానికి వధువు లేదా వరుడు ఉత్తరంపై ఏదో రాసి ఇక ఇంటి నుంచి పారిపోవడం లాంటి సీన్లు చాలానే కనిపించాయి. అయితే ఇటీవల కాలంలో నిజ జీవితంలో ఇలాంటి సీన్స్ రిపీట్ అవుతున్నాయి అని చెప్పాలి. పెళ్లి గురించి మాట్లాడుకునేటప్పుడు సైలెంట్ గానే ఉండే వధూవరులు ఇక పెళ్లి ముహూర్తం సమయానికి మాత్రం ఇంటి నుంచి జంప్ అవడం లాంటివి చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి.

 పెళ్లికి ఒక్కరోజు ముందు ఫేషియల్ చేయించుకోవడానికి బయటకు వెళ్లాడు వరుడు. ఇక అక్కడ నుంచి అటే పారిపోయాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని దేవరియా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అయితే కుటుంబ సభ్యులు అప్రమత్తమై చుట్టుపక్కల వెతికినప్పటికీ... అతని ఆచూకీ మాత్రం లభించలేదు. అయితే విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి చేరుకొని ఇదేంటి అంటూ నిలదీశారు. దీంతో తన చిన్న కొడుకుతో పెళ్లి జరిపిస్తాను అంటూ తండ్రి చెప్పగా.. వధువు తరుపువారు ఒప్పుకోలేదు. చివరికి ఇక వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఇచ్చిన కట్నం కానుకలు అన్నిటిని కూడా మళ్లీ వెనక్కి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: