ఐదేళ్ల కూతురిపై లైగింక దాడి చేసిన తండ్రికి.. కోర్టు ఏం శిక్ష వేసిందంటే?

praveen
పాము గుడ్లు పెట్టిన తర్వాత తన పిల్లల్ని తానే తింటుంది అనే విషయం మనందరికి తెలుసు. కానీ కన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు యువ పాశం గా మారితే ఎలా ఉంటుంది అని కేరళలో జరిగిన ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఐదేళ్ల వయసున్న తన కుమార్తెను లాలించి, ఆడించాల్సిన కన్నా తండ్రి ఆ అమ్మాయి పై పలుమార్లు అత్యాచారం చేయడం కేరళ లో సంచలనం గా మారింది. ఈ సంఘటన పట్ల న్యాయస్థానం సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అసలు విషయంలోకి వెళితే తిరువనంతపురంలోని దేవి కులంలో ఒక వ్యక్తి తన ఐదేళ్ల కూతురిపై 2021 వ సంవత్సరంలో లైంగిక దాడి చేసాడు.  పలుమార్లు ఈ అత్యాచారం కొనసాగడంతో పాటు ఆ పాపకి మేనమామ వరస అయ్యే వ్యక్తి కూడా అదే దారుణానికి ఒడి కట్టడంతో ఒడిగట్టాడు.

అయితే ఒకసారి ఆ పాపపై జరుగుతున్న దారుణాన్నీ తన తల్లి కళ్లారా చూడడంతో షాక్ కి గురయి ఆమె సదరు ప్రాంతంలోని శిశు సంక్షేమ శాఖకు సమాచారం అందించడంతో ఆ వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మొత్తంగా ఆ కేసు గురించి 18 మంది సాక్షులను విచారించిన దేవి కులం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ నిందితులకు గరిష్టంగా 84 ఏళ్ల పాటు శిక్ష విధించింది.

అయితే తండ్రితో పాటు మేన మామ కూడా అదే శిక్ష విధించిన కోర్టు ఐపిసి మరియు జువైనల్ జస్టిస్ ఆక్ట్ ప్రకారం ఈ శిక్ష ఒకేసారి అనుభవించాలని ఆదేశించడంతో గరిష్టంగా 20 ఏళ్ల పాటు నిందితులు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. ఈ శిక్షతోపాటు నిందితులు చెరొక మూడు లక్షలు నష్టపరిహారం కూడా చెల్లించాలని, ఆ డబ్బుని బాధితురాలికి అందించాలని సైతం ఆదేశాలు జారీ చేసింది. వారితో పాటు దేవీకులం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సైతం కొంత పరిహారం అందించాలని ఆదేశాలను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: