భక్త మరణంపై పుస్తకం రాసింది.. అక్కడే దొరికిపోయింది?

praveen
సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఊహించని విషాదకర ఘటన జరిగింది. ఏకంగా భర్త అనారోగ్యంతో మరణించాడు. దీంతో భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది భార్య. ఈ క్రమంలోనే భర్త మరణించిన తర్వాత పిల్లలు తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ఆమె ఒక పుస్తకం రాసింది. కానీ ఆమె రాసిన పుస్తకమే చివరికి ఆమెను ఇరుకులో పెట్టేసింది. ఆ పుస్తకం ఊహించని నిజాన్ని బయటపెట్టింది. అయితే ఆమె భర్తది సహజమరణం కాదు హత్య అనే విషయాన్ని పోలీసులు తేల్చారు. భార్య విషం ఇచ్చి చంపింది అన్న విషయాన్ని ఇక పుస్తకంలో వ్యాఖ్యల ద్వారా గుర్తించారు.



 సమ్మిట్ కౌంటీకి చెందిన కౌరి గార్డెన్ రిచిన్స్ అనే 33 ఏళ్ల మహిళ భర్త ఎరిక్ రిచెన్స్ కలిసి ఉంటుంది. వీరికి ముగ్గురు పిల్లలు.  అయితే ఇటీవలే ఆమె భర్త చనిపోయాడు. ఇక భర్త చనిపోయిన తర్వాత ఆ బాధ నుంచి ఎలా బయటపడ్డాం అన్న విషయం గురించి ఒక పుస్తకం రాసింది ఆమె. అయితే ఇక ఈ పుస్తకం పోలీసుల చేతికి చిక్కింది. దీంతో ఇక అందులో ఆ మహిళ భర్త చనిపోవడానికి ముందు మిక్స్డ్ వోడ్కా ఇచ్చినట్లు రాసింది. అయితే పోలీసులు అనుమానం వచ్చి ఇక ఆమె భర్త పోస్టుమార్టం రిపోర్టు చూడగా.. ఇక అక్కడ పరిమితికి 5 రెట్లు అతని శరీరంలో పెంటనిల్ ఓవర్డోస్ ఉందని గుర్తించారు.



 ఈ క్రమంలోనే భార్యను అదుపులోకి తీసుకొని విచారించగా జరిగిన విషయాన్ని మొత్తం పూర్తిగా ఒప్పేసుకుంది. ఇక ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. ఇలా భర్త మరణం మీద ఆమె ఆర్ యు విత్ మీ అనే టైటిల్తో బుక్ రాసింది అని చెప్పాలి.  భర్త మరణం వల్ల కలిగిన విషాదం నుంచి తను తన ముగ్గురు పిల్లలకు శాంతిని కలిగించడానికి ఈ పుస్తకం రాసినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది సదరు మహిళ. కాగా ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులోనే ఉంది అని చెప్పాలి. మే 19వ తేదీన నిర్బంధ విచారణ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: