ఫెవిక్విక్ తోవైద్యం చేసిన.. ఆసుపత్రి సీజ్?

praveen
సాధారణంగా డాక్టర్ల దగ్గరికి ఎవరైనా పేషెంట్ లోతుగా గాయంతో వచ్చాడు అంటే చాలు ఇక ఏ డాక్టర్ అయినా సరే కుట్లు వేసి ఆ గాయానికి చికిత్స చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రం ఒక డాక్టర్ లోతైన గాయంతో తన దగ్గరికి వచ్చిన బాలుడికి కుట్లు వేయడానికి బదులు ఫెవిక్విక్ వేసి చర్మాన్ని అతికించిన ఘటన ఎంతో సంచలనగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసుకూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు బంధువుల పెళ్లి నిమిత్తం ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాకు వచ్చారు.



 అయితే వీరి కుమారుడు ఏడేళ్ల ప్రవీణ్ చౌదరి రాత్రి పెళ్లి వేడుకల్లో ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో ఎడమ కంటి పై భాగంలో గాయం అయింది. వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అయితే లోతుగా తెగిన చోట వైద్యులు సాధారణంగా కుట్లు వేసి చికిత్స అందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైద్యుడు మాత్రం ఏకంగా ఫెవిక్విక్ తో చర్మాన్ని అతికించాడు. దీంతో ఈ విషయంపై తండ్రి వంశీకృష్ణ వైద్యుడిని నిలదీసాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.



 అయితే ఇక ఈ ఘటన  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిపోవడంతో అటు ఉన్నతాధికారులు స్పందించారు. ఇలా బాలుడికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో వైద్యం చేసిన ఐజ రెయిన్బో ఆస్పత్రిని అధికారులు సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైద్య సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. అయితే ఇలా కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో ఎందుకు చికిత్స చేసారు అని బాలుడి తండ్రి ప్రశ్నిస్తే వైద్యులు నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు. కాగా ఇక ఇలాంటి వైద్యులు ఏకంగా వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు అని ఎంతోమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: