అప్పు తిరిగి చెల్లించలేదని.. ఆడబిడ్డను తీసుకెళ్లాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలం లో మనుషులు వ్యవహరిస్తున్న తీరు చూసిన తర్వాత సభ్య సమాజం లో బ్రతుకుతున్న మనుషుల కంటే అడవిలో ఉండే క్రూర మృగాలే చాలా బెటర్ ఏమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే సాటి మనుషుల విషయంలో జాలీ దయ చూపించాల్సిన మనుషులు స్వార్థం అనే మాయలో మునిగిపోయి చివరికి చేయకూడని పనులను చేసేస్తూ ఉన్నారు.. తాము మానవత్వం ఉన్న మనుషులం ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అందరికీ తెలిసినప్పటికీ.. తప్పులు చేయడానికి ఎవరు వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి.

 వెరసి నేటి రోజుల్లో మనుషులు వ్యవహరిస్తున్న తీరు చూసి సభ్య సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇటీవల ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా అప్పులు ఇచ్చిన వ్యక్తులు దానిని వసూలు చేసే క్రమంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇలా తమ దగ్గర అప్పు తీసుకున్న వారు తిరిగి చెల్లించకుంటే ఏదైనా ఆస్తిని జప్తు చేయడం ఖరీదైన వస్తువుని తమతో పాటు తీసుకువెళ్లడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం నీచమైన పని చేశాడు.

 అప్పు తీసుకున్న ఒక కుటుంబం తిరిగి చెల్లించక పోవడంతో అదే కుటుంబానికి చెందిన ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. మహేంద్ర పాండే అనే వ్యక్తి నుంచి 2 లక్షలు అప్పుగా తీసుకున్న కుటుంబం తిరిగి చెల్లించలేక పోయింది. అయితే ఆ కుటుంబం లో ఉన్న ఆరవ తరగతి చదువుతున్న బాలికను చదివిస్తానని చెప్పి.. తన ఇంటికి తీసుకెళ్లాడు మహేంద్ర పాండే. ఇక ఎవరికి తెలియకుండా రహస్యం గా రెండో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: