డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు.. కోర్టు వింత శిక్ష?

praveen
మద్యం సేవించి వాహనం నడపడం నేరం అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇలా మద్యం సేవించి వాహనం నడపడం ద్వారానే ప్రస్తుతం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్న విషయంపై కూడా అందరికీ ఒక క్లారిటీ ఉంది. అయితే కొంతమంది ఇలా మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అన్నది ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలను చూసిన తర్వాత అర్థమవుతుంది. అయితే ఇదే విషయంపై అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అవగాహన చర్యలు చేపడుతున్నారు.

 ఇంత జరుగుతున్న అటు మందుబాబుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అన్న విషయం తెలుస్తుంది. ఎంతోమంది మద్యం సేవించి వాహనం నడపడం విషయంలో ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. వెరసి నేటి రోజుల్లో రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇలా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వాహనదారులకు భారీ జరిమానాలు విధించిన మార్పు రావట్లేదు. ఇలాంటి సమయంలోనే ఇక ఇలా మందుబాబులకు వినూత్నమైన శిక్షలు వేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. మద్యం సేవించి వాహనం నడుపుతూ కొంతమంది వాహనదారులు దొరికిపోయారు. ఇంకేముంది పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు వారికి వింత శిక్షణ విధించింది. ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగులోకి వచ్చింది.  డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 50 మంది మందుబాబులకు కూడా వైజాగ్ లోని బీచ్ పరిసరాలలో ఉన్న వ్యర్ధాలను ఏరివేయాలి అంటూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు శిక్ష విధించింది. అయితే ఇలాంటి శిక్ష కారణంగా మిగతా మందు బాబుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది అని అభిప్రాయ పడింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: