ఉగ్ర కుట్ర.. విచిత్రమైన బాంబు స్వాధీనం చేసుకున్న పోలీసులు?

praveen
సాధారణంగానే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పచ్చగడ్డి వేస్తే బగ్గు మంటుంది అన్న విధంగానే పరిస్థితులు ఉంటాయి అన్న విషయం తెలిసిందే . ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఎప్పుడూ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణమే నెలకొంటూ ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఎంతోమంది ఉగ్రవాదులు అక్రమంగా భారత భూభాగంలోకి చొరబడటం ఇక అక్కడ భారీగా ఉగ్ర కుట్రలకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మంది ఉగ్రవాదులు ఇలా బాంబు పేలుళ్లతో మారణ హోమం సృష్టించిన ఘటనలు కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవల కాలంలో అటు భారత సరిహద్దుల్లో సైనికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉగ్రవాదుల ఆటలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక వివిధ ఆపరేషన్స్ నిర్వహించి భారత్ లోకి అక్రమంగా చొరబడి స్థావరంలో నక్కి ఉన్న ఉగ్రవాదులను కనిపెట్టి మరి ఎన్కౌంటర్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా భారత ఆర్మీ ఇప్పటికే వందల మంది ఉగ్రవాదులను ఎన్కౌంటర్ ద్వారా మట్టుపెట్టినప్పటికీ కూడా అటు పాకిస్తాన్ నుంచి ఉగ్ర బెడద ఎక్కడ తగ్గడం లేదు. ఎన్నో మారణాయుధాలు బాంబులతో అటు భారత్ లోకి అక్రమంగా చొరబడుతూనే ఉన్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఇటీవల ఏకంగా భారీ ఉగ్ర కుట్రను కాశ్మీర్ పోలీసులు ఛేదించారు. సరికొత్త టెక్నాలజీతో తయారుచేసిన బాంబు దాడి కుట్రను భగ్నం చేశారు పోలీసులు. బాంబు పేలుళ్లతో సంబంధం ఉన్న ఒక టీచర్ వద్ద గతంలో ఎన్నడూ లేనట్లుగా పర్ ఫ్యూమ్ బాంబ్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలాంటి బాంబును గుర్తించడం ఇదే మొదటిసారి అని కాశ్మీర్ డిజిపి దిల్ బాగ్ సింగ్ తెలిపారు. పెర్ఫ్యూమ్ బాటిల్ను ఎవరైనా పొరపాటున ప్రెస్ చేస్తే ఇక బాంబు లాగా విస్పోతనం చెందే విధంగా దీనిని తయారు చేసినట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: