
తాతయ్యే కదా అని దగ్గరికెళ్తే.. ఆ నీచుడు ఏం చేశాడంటే?
వెరసి రోజు రోజుకు ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ఇక ఇలా వెలుగులోకి వస్తున్న ఘటనలు ప్రతి ఆడపిల్లకు తండ్రికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని చెప్పాలి. ఇటీవలే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నీచున్ని పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం పదేళ్ల క్రిందట మేడ్చల్ నగరానికి వచ్చారు. అద్వెళ్లి లో నివాసం ఉంటున్నారు. అయితే దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఇక ఇద్దరు చిన్నారులు కూడా ఒకటి, రెండు తరగతులు చదువుతూ ఉండడం గమనార్హం.
అయితే వారి ఇంటి పక్కనే 44 ఏళ్ల మోహిన్ అనే వ్యక్తి కూడా ఉంటున్నాడు. వరుసకు ఆ బాలికలకు సదరు వ్యక్తి తాత అవుతాడు. ఇక తాత కావడంతో ఎప్పుడు సరదాగా బాలికలు మాట్లాడుతూ ఉండేవారు. అయితే ఇటీవల బాలికలకు చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకువెళ్లిన సదరు వ్యక్తి చిన్న కుమార్తెను ఇంటికి పంపించి ఏడేళ్ల పెద్ద కుమార్తె పై లైంగిక దాడి ప్రయత్నించాడు. ఏమీ ఎరగనట్టు నిజాంబాద్ లో బంధువుల ఫంక్షన్ కి వెళ్ళాడు. పని నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని పోలీసులు ఇక నిజాంబాద్ పోలీస్ లకు సమాచారం ఇచ్చి అక్కడ మోహిన్ ను అదుపులోకి తీసుకున్నారు.