ఆడపిల్ల పుట్టలేదని.. మగ బిడ్డను చంపేసింది?
పిల్లల కళ్ళల్లోంచి నీళ్లు వచ్చాయి అంటే చాలు తల్లి గుండె తరుక్కుపోతూ ఉంటుంది అని చెప్పాలి. అందుకే తల్లి ప్రేమను ఎంత గొప్ప పదాలతో పోల్చిన తక్కువే అవుతుందని మహామహులు సైతం చెప్పారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం తల్లి ప్రేమకే కళంకం తెచ్చే విధంగా కొంతమంది మహిళలు వ్యవహరిస్తున్న తీరు సంచలనంగా మారిపోతుంది అని చెప్పాలి. ఏకంగా కడుపున పుట్టిన పిల్లల విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ చూపించకుండా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు తీస్తూ ఏకంగా సొంత పిల్లల పాలిటె యమకింకరులుగా మారిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇలా ఇటీవలే కాలంలో ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పల్లో పడేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నమైన ఘటన జరిగింది కర్ణాటక కుటుకుంజాకు చెందిన పార్వతి అనే మహిళకు నాలుగేళ్ల కిందట పెళ్లయింది.. విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంది సదరు మహిళా. అయితే 2019వ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె మాత్రం ఆడపిల్ల కావాలని కోరుకుంటూ ఉంది. దీంతో ఆడపిల్ల పుట్టకపోవడంతో నిరాశ చెందింది. చివరికి కోపంతో కనీసం చంటి బిడ్డకు పాలు కూడా ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత బాబును ఇంటి ముందు ఉన్న బావిలో పడేసింది. అయితే కుటుంబ సభ్యులు గమనించి శిశువును బయటకు తీసి అటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఆ కసాయి తల్లిని అరెస్టు చేశారు.