సజీవ సమాధికి సిద్ధమైన యువకుడు.. కానీ అంతలో ట్విస్ట్?

praveen
ప్రపంచం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పటి ఆచారాలను సాంప్రదాయాలను పక్కనపెట్టి అందరూ అధునాతన జీవనశైలికి అలవాటు పడుతూ ఉంటే కొంతమంది మాత్రం ఇంకా అనాగరిక జీవితంలోనే బ్రతకడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. తద్వారా ఆధునిక సమాజంలో కూడా అందరిని ఆశ్చర్యపరిచే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్ అని చెప్పాలి. వెరసి కొంతమంది వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు అయితే అందరిని అవ్వక్కయ్యేలా చేస్తుంది. అంతేకాదు కుటుంబాల్లో విషాదాన్ని కూడా నింపుతూ ఉంది.

 ఇటీవలే ఓ యువకుడు తనను శివుడు పిలుస్తున్నాడు అంటూ సూసైడ్ నోట్ రాసి ఏకంగా ఆత్మహత్య చేసుకుని చివరికి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ ఘటన గురించి మరవక ముందే ఇక ఇప్పుడు కంప్యూటర్ యుగం లో మరోసారి అందరిని అవాక్కయ్యేలా చేసే మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. సాధారణం గా దేవీ నవరాత్రులను ఎంతోమంది ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే దేవీ నవరాత్రుల సమయంలో సజీవ సమాధి అయితే జ్ఞానోదయం కలుగుతుందని యువకుడు చేయకూడని పని చేశాడు.

 దొంగ స్వామీజీలు చెప్పిన మాటలను గుడ్డిగా  నమ్మిన యువకుడు చివరికి సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు.  అయితే ఇందుకు అతని తండ్రీ కూడా సహాయం చేయడం గమనార్హం. ఈ క్రమంలోని తండ్రి సాయంతో ఆరడుగుల గోతినితోవి అందులోకి వెళ్ళాడు. ఈ ఘటన యూపీ ఉన్నావ్ జిల్లా తాజ్ పూర్ లో వెలుగులోకి వచ్చింది. అయితే స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని కాపాడారు. అంతేకాదు అక్కడే ఉన్న ఇద్దరు స్వామీజీలను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: