దారుణం : గర్భం నుంచి బిడ్డను తీసి.. మళ్లీ లోపలే?

praveen
ఒకవైపు ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మారుస్తామని అధునాతన వైద్య సదుపాయాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే  పేద ప్రజలకు అందేలా చూస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువగా ఫీజులు వసులు చేస్తున్నారని   సామాన్యులు భయపడి ప్రభుత్వం చెప్పిన మాటలు నమ్మి సర్కారు దవాఖానాల్లో కి వస్తూ ఉంటే చివరికి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ఎంతో మంది వైద్యులు.

 వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఏకంగా నిర్లక్ష్యంగా వైద్య చికిత్సలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలమీదికి తెస్తున్నారు అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆపరేషన్ నిర్వహించి కత్తెర లాంటి వస్తువులు ఏకంగా పేషెంట్ కడుపులోనే  వదిలేసి కుట్లు వేయడం లాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం అంతకుమించిన దారుణమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో కి వెళ్ళాలి అంటేనే ప్రజలందరూ జంకుతున్న  పరిస్థితి ఏర్పడింది.

 నిర్లక్ష్యం అయిన వైద్య చికిత్స ద్వారా ఏకంగా గర్భిణీ ప్రాణాలతో చెలగాటమాడారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.  అసోంలో ఓ ప్రభుత్వ వైద్యుడు నిర్లక్ష్యం ఏకంగా గర్భిణీ ప్రాణాలకే  మీదకు తీసుకువచ్చింది.  నొప్పులు రావడం తో ఆమె ఆసుపత్రికి వెళ్ళింది.  అయితే పరీక్షించ కుండానే  ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసాడు.   కానీ పిండం వృద్ధి చెంద లేదు అని గ్రహించి మళ్ళీ లోపల పెట్టి కుట్లు  వేశాడు. బాధితురాలి పరిస్థితి విషమించడం తో మరో ఆస్పత్రికి వెళ్లగా ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. దీంతో డాక్టర్ పై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: