అమ్మ నాన్న జాగ్రత్త అంటూ చెప్పి.. చివరికి యువకుడు?

praveen
ఇటీవలి కాలంలో ఆత్మహత్య అనేది ప్రతి రోజూ వినిపించే ఒక కామన్ వర్డ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నపాటి సమస్యలకు ఆత్మహత్య ఒక్కటే చివరికి పరిష్కారం అని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడాల్సిన మనిషి చిన్న కష్టానికి కుంగిపోతూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.. వెరసి రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలూ ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి.

 ఇలా నేటి రోజుల్లో యువత క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు తమ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయి. ఇక ఎన్నో కుటుంబాలను కూడా శోకసంద్రంలో ముంచేస్తున్నాయ్. రోడ్డున పడే పరిస్థితి తీసుకు వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.  హాయిగా సాగిపోయే జీవితం అలాంటి సమయంలోనే అతడు వెనకా ముందు ఆలోచించకుండా కొన్ని అప్పులు చేశాడు. చివరికి ఆర్థిక సమస్యల్లో మునిగిపోయాడు. అప్పుల వారి నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో ఇక బలవన్మరణం ఒక్కటే దారి అని భావించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు.

 వరంగల్ కాశిబుగ్గ కు చెందిన మామిడి లక్ష్మీసాయి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇటీవల ఇంటర్వ్యూ ఉందని వెళ్ళాడు. ఒక హోటల్లో బస చేశాడు. అయితే రెండు రోజులుగా కనిపించలేదు. అద్దె కూడా చెల్లించక పోవడంతో  రూంబాయ్ తలుపు కొట్టాడు. కానీ లక్ష్మీ సాయి మాత్రం తలుపు తీయకపోవడంతో యజమానికి చెప్పాడు. యజమాని పోలీసులకు సమాచారం అందించగా తలుపులు బద్దలు కొట్టి చూస్తే బాత్రూంలో బైండింగ్ వైర్ తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే తెలిసి తెలియక అప్పుడు చేశాను.. ఎన్నో అబద్ధాలు చెప్పాను.. నా మాటలు దయచేసి అర్థం చేసుకోండి.. అమ్మ నాన్న తమ్ముడు జాగ్రత్త అని సూసైడ్ నోట్ కూడా అక్కడ లభ్యం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: