మిస్టరీ వీడింది.. ఆ ట్రాన్స్ జెండర్ ని చంపింది ఎవరో కాదు?

praveen
ఇటీవలే సంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పదంగా ట్రాన్స్జెండర్ మృతిచెందిన కేసు సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలుస్తుంది.  ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారూ పోలీసులు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలను ఇటీవలే పోలీసులు వెల్లడించారు. ఎల్బీ నగర్ కు చెందిన దీపిక అంబర్పేట కు చెందిన సాయి హర్ష   మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దీపిక బోనాల సమయంలో సంపాదించిన డబ్బుతో వారు జీవనం సాగిస్తూ ఉండేవారూ. ట్రాన్స్ జెండర్ దీపిక  ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా సాయి హర్ష చూసుకుంటూ ఉండేవాడు.

 అయితే గతంలో దీపిక సాయి హర్ష నుంచి 1.5 లక్షల అప్పు గా తీసుకున్నట్లు తెలుస్తోంది. సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరడంతో దీపికా అతన్ని దూరం పెట్టడం మొదలు పెట్టింది. దీంతో దీపిక పై  కక్ష పెంచుకున్నాడు సాయి హర్ష. ఇక ఇటీవలే స్నేహితులతో కలిసి మారేడుపల్లి బోనాల జాతరకు దీపిక వెళ్లిన సమయంలో సాయి హర్ష అక్కడికి వెళ్లి దీపికతో కలిసి మద్యం తాగి భోజనం చేశాడు. ఇక ఆ తర్వాత కారులోనే ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీపిక కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫిట్స్ వచ్చి చనిపోయింది అని చెప్పి మృతదేహాన్ని కార్లో వదిలేసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వచ్చి దీపికను మృతి చెందినట్లు తేల్చారు.  సాయి హర్ష పై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.

 అయితే దీపికను హత్య చేసిన తర్వాత బోనం, మేకప్ కిట్, పట్టగొలుసులు ఇక అన్ని ఆభరణాలను కూడా సాయి హర్ష దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.. ఈ క్రమంలోనే అతని రిమాండ్ కు తరలించి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే దీపిక తో పాటు ఇంటి నుంచి వచ్చిన మరో స్నేహితుడు శివ ప్రమేయం కూడా ఈ హత్యలో ఉందా లేదా అనే విషయంపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: