కారులో యువతి పై అత్యాచారం.. కామంధుడి రాక్షసత్వం..

Satvika
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కొత్త చట్టాల ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.. అమ్మాయి లకు ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రభుత్వం కొత్త చర్యలను తీసుకుంటూన్న సంగతి తెలిసిందే.. అయిన కామాందుల లో ఎటువంటి మార్పులు రాలేదు.. వరుసగా లైంగిక  దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తమ కామవాంఛ తీర్చుకోవడాని కి వీలైనన్నీ అడ్డదారులు తొక్కుతు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది.

కదులుతున్న కారులో ఓ యువతి పై లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఎస్‌యూవీ నుంచి దూకిన యువతి కి గాయాలైన ఘటన లక్నోలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ వద్ద చోటు చేసుకుంది. జరిగింది. సహచరుడే ఈ దారుణాని కి ఒడిగట్టడంతో తనను తాను కాపాడుకునేందుకు యువతి కారు నుంచి బయటకు దూకడం తో అటుగా వెళుతున్న వారు పోలీసుల కు సమాచారం అందించారు. ఈ ఘటన లో గాయాలైన యువతిని చికిత్స నిమిత్తం రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు..

కోలుకున్న అనంతరం యువతి స్టేట్‌మెంట్‌ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హోటల్‌లో పనిచేసే యువతితో పరిచయం పెంచుకున్న నిందితుడు తన మేనకోడలు కూడా హోటల్ మేనేజ్‌మెంట్ చేసేందుకు ఆసక్తి చూపుతోందని ఆమెకు సాయం చేయాలని కోరాడు. యువతి ఇంటి నుంచి హోటల్‌కు వెళుతుండ గా తాను కారులో డ్రాప్ చేస్తానని లిఫ్ట్ ఆఫర్ చేశాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత యువతితో అసభ్యంగా ప్రవర్తించడం తో షాక్‌కు గురైన బాధితురాలు ఎస్‌యూవీ నుంచి కిందకు దూకింది.. అప్పుడు ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అటుగా వెళుతున్న కొందరు పోలీసుల కు సమాచారం అందించారు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: