అల్లారుముద్దుగా పెంచితే.. చివరికి కడుపుకోతే మిగిలింది?

praveen
ఇటీవల కాలం లో ఎంతో మంది ప్రేమికులు తమ ప్రేమను గెలిపించు కోలేక పోయాము అని చివరికి మనస్థాపం తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమించిన వారి కోసం ప్రాణం వదులుతున్నాము.. నేను గొప్ప ప్రేమికులం అని  ఆలోచిస్తున్నారు తప్పా తమను కని పెంచిన తల్లి దండ్రులు ఏమైపోతారో అని ఒక్క సారి కూడా ఆలోచన చేయడం లేదు. చివరికి ఇలా యువత  తీసుకుంటున్న నిర్ణయాలు ఏకంగా తల్లి దండ్రులకు తీరని కడుపు కోత మిగులుస్తున్నాయ్ అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.


 ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడం కారణం గా ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం లో వెలుగు లోకి వచ్చింది. అడవి కొరియన్బెడు  సమీపం లో అరుణ నది ఒడ్డున ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏఏడబ్ల్యూ కి చెందిన మార్కండేయ గోవిందమ్మ దంపతులకు 22 ఏళ్ల  కుమారుడు గుర్రప్ప ఉన్నాడు. అయితే పక్క గ్రామానికి చెందిన అడవి శంకరాపురం దళిత వాడకు చెందిన నాదముని అంకమ్మ దంపతుల కుమార్తె 18 ఏళ్ల పల్లవిని ప్రేమించాడు. వీరు మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు.. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. కానీ పెళ్ళికి నిరాకరించారు.


 పల్లవి కి వేరొకరితో పెళ్లి చేసేందుకు ప్రయత్నించగా.. బాల్య వివాహం చేస్తున్నారంటూ గుర్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పెళ్లి ఆగి పోయింది. ఇటీవలే  కలుసుకున్న ఇద్దరు ప్రేమికులు చావులో  అయినా కలిసి ఉండాలని భావించి చివరికి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆత్మహత్యకు పాల్పడ్డ గుర్రప్ప పల్లవి కుటుంబాలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. వారి ఆశలన్నీ పిల్లల మీద పెట్టుకున్నారు తల్లిదండ్రులు. కానీ చివరికి ఆ పిల్లల దూరమవడంతో తల్లిదండ్రులు అరణ్యరోదనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: