
ఓరి దేవుడా.. పెద్ద కొండ.. జవాన్ల ప్రాణం తీసింది?
అందుకే ప్రతి ఒక్కరు కూడా సైనికులకు ఎనలేని గౌరవాన్ని ఇస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సరిహద్దుల్లో పహారా కాస్తూ శత్రుదేశాల కాల్పుల్లో మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతు ఉంటారు సైనికులు. ఇలా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక ఇటీవల ఊహించని సంఘటన జరిగింది. ఊహించని ప్రమాదం కారణంగా ఏకంగా ఆరుగురు జవాన్లు మృతిచెందిన ఘటన కాస్త దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. వర్షాకాలం కావడంతో అప్పుడప్పుడు కొండచరియలు విరిగి పడటం లాంటివి జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. మణిపూర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనే జిల్లా తుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆర్మీ క్యాంపు వద్ద ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ క్రమంలోనే ఈ ఘటనలో ఆరుగురు సైనికులు దుర్మరణం పాలయ్యారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 13 మంది జవాన్లను బయటికి తీశారు. ఇక జవాన్లకు తీవ్ర గాయాలు అవ్వగా.. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై స్పందించిన మణిపూర్ ముఖ్యమంత్రి బిరేష్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక గాయపడిన సైనికులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.