షాకింగ్ : సముద్రపు అల.. అతన్ని మింగేసింది?

praveen
దేశం కాని దేశం కొడుకుని పంపించాలంటేనే తల్లిదండ్రులు వందసార్లు ఆలోచించారు. కానీ ఏం చేస్తాం పెద్ద చదువులు చదివితే బాగా సెటిల్ అయ్యి కొడుకు ప్రయోజకుడు అవుతాడు. దీంతో కాస్త మనసు భారంగా ఉన్న పెద్ద చదువుల కోసం కొడుకుని విదేశాలకు పంపించారు ఆ తల్లిదండ్రులు. ఇక బాగా చదివి కొడుకు ప్రయోజకుడు అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. లక్షలు రూపాయలు ధారపోసి చదివిస్తున్నారు. త్వరలోనే తమ కొడుకు స్వదేశానికి తిరిగి వస్తాడు అని ఎదురు చూడటం మొదలుపెట్టాడు ఆ తల్లిదండ్రులు. అయితే కొడుకు తిరిగి రాలేదు కానీ కొడుకు మరణం మాత్రం ఆ తల్లిదండ్రులను చేరింది.

 దీంతో కొడుకు వస్తాడు అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు మరణవార్త విని గుండె ముక్కలయింది. దీంతో ఆ పేరెంట్స్ అరణ్యరోదనగా విలపించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలోని బాలాజీ నగర్ లో జరిగింది. ఒక అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న శ్రీనివాసరావు, శారదా దేవి దంపతులకు  కుమారుడు దిలీప్ ఉన్నాడు. అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన తర్వాత ఇటలీలోని మిలాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ లో ప్రవేశం పొందాడు. ఈ క్రమంలోనే 2019లో సెప్టెంబర్ లో అక్కడికి వెళ్ళాడు.

 ఇక గత ఏడాది ఏప్రిల్లో మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వచ్చి కొన్నాళ్ళు ఉండి సెప్టెంబర్ లో ఇటలీకి వెళ్ళిపోయాడు దిలీప్.  కోర్సు పూర్తయిన తర్వాత త్వరలోనే ఉద్యోగం సాధించి కర్నూలు కి వస్తాను అంటూ తల్లిదండ్రులకు చరవాణి ద్వారా చెప్పాడు.. అయితే ఇటీవలే పీజీ పూర్తి చేసుకున్న సంతోషంలో స్నేహితులతో కలిసి  బీచ్ కు వెళ్ళాడు దిలీప్. కానీ సంతోషంగా ఉన్న అతని ప్రాణాలను సముద్రపు అలలు మింగేశాయి. రోడ్డు వరకు వచ్చిన అలలు అతన్ని సముద్రంలోకి లాక్కెళ్లాయ్. రక్షించడానికి  ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: