కాపురానికి వెళ్ళనన్న కూతురు.. ఏం చేసాడో తెలుసా?

praveen
నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం అనేది ఎక్కడా కనిపించడం లేదు. సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి ఎక్కడ వెనకడుగు వేయడం లేదు మనిషి. ఒకప్పుడు  ముక్కు మొఖం తెలియని వారికి ఏదైనా చిన్న అపాయం తలెత్తినా కూడా అయ్యో పాపం అంటూ జాలిపడిన మనిషి.. ఎప్పుడు సొంతవారి  ప్రాణాలు తీయడానికి వెనకాడటం లేదు అని చెప్పాలి.. ఇలా నేటి సభ్యసమాజంలో కనిపిస్తోంది మానవత్వం ఉన్న మనుషులు కాదు అడవిలో ఉండే క్రూర మృగాల కంటే క్రూరంగా ప్రవర్తిస్తున్న మనుషులు అన్నది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే చెబుతున్నాయి.


 చిన్నచిన్న కారణాలకే క్షణికావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ చివరికి ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ఇక సొంత వారి ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో సభ్య సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరికి. ఎవరు ఏ ఈ క్షణంలో  ఎటువైపు నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తారో అని భయపడుతూ బతకాల్సిన దుస్థితి వచ్చింది  ఇకపోతే ఇటీవల ఏకంగా కన్న తండ్రి కూతురిని అతి కిరాతకంగా హతమార్చాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురిని క్షణికావేశంలో చివరికి ప్రాణాలు తీసేసాడు.



 ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కాపురానికి వెళ్ళను అని నవవధువు చెప్పినందుకు తండ్రి హత్య చేయడం స్థానికంగా అందరినీ ఉలికిపాటుకు గురిచేసింది. జైనల్లిపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య మే 8వ తేదీన కూతురు సరస్వతి పెళ్లి చేశాడు. అయితే పెళ్ళి తనకు ఇష్టం లేదని చెప్పిన వినకుండా బలవంతంగా వివాహం జరిపించాడు. అయితే ఇటీవలే తనకు పెళ్లి ఇష్టం లేదని అత్తింటి వారి ఇంటికి వెళ్ళను అంటూ మొండికేసింది సరస్వతి.దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణయ్య కూతురుతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన భార్యను కూడా రోకలిబండతో కొట్టి చంపేసాడు. తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: