ఫోన్ కోసం పరిగెడితే.. శరీరం ముక్కలైపోయింది?

praveen
సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో రైలు ప్రయాణాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇలా రైలు ప్రయాణాలు చేస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తూ ఉంటారు. లేదంటే దోపిడి దొంగలు అందినకాడికి దోచుకోవడం ఖాయం అని చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని సినిమాల్లో కూడా రైళ్లలో దొంగతనాలకు ఎలా జరుగుతాయి అన్నది కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇక్కడ జరిగిన ఘటన తెలిసిన తర్వాత మాత్రం ట్రైన్ లో ప్రయాణం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని చెప్పాలి.

 ఒక వ్యక్తి ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు ఈ క్రమంలోనే అదే ట్రైన్లో వెళ్తున్న మరో వ్యక్తి తన ఫోన్లో సిగ్నల్ రావడం లేదని ఒకసారి ఫోన్ మాట్లాడి ఇస్తాను అంటూ బ్రతిమిలాడాడు. ఇక సాటి మనుషులకు సహాయం చేయడం మంచి విషయమే కదా అని ఫోన్ మాట్లాడుకోవడానికి ఇచ్చాడు. ఇక ఇదే సమయంలో కేవలం రెప్పపాటు కాలంలో ఫోన్ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతని వెంబడించిన యజమాని రైలు కింద పడి నుజ్జునుజ్జ అయ్యాడు.

 ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని షాదోల్ స్టేషన్ వద్ద వెలుగులోకి వచ్చింది. 54 ఏళ్ల మనోజ్ నేమా అనే వ్యక్తి ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పని చేస్తున్నాడు.  దుర్గా అజ్మీర్ రైలు లో సాగర్ కి వెళుతున్నాడు. కాగా ఆయన దగ్గరికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి అర్జెంట్గా ఒక ఫోన్ మాట్లాడుకోవాలి అంటూ మొబైల్ అడిగాడు.. ఈ క్రమంలోనే మనోజ్ అతనికి ఫోన్ ఇచ్చాడు.. ఇక షాదోల్ రైల్వే స్టేషన్ వద్దకు రాగానే రైలు స్లో అవ్వడంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు.

 దీంతో మొబైల్ యజమాని అతని వెంట పడి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో కాలుజారి పట్టాలపై పడిపోయాడు. దీంతో మరో వైపు నుంచి వేగంగా దూసుకు వస్తున్న రైలు ఢీ కొట్టడంతో పట్టాలపై నుజ్జు నుజ్జు అయ్యాడు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని దగ్గర నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.  ఫోన్ దొంగిలించింది షాదోల్ జిల్లా కేరి గ్రామవాసి అయిన రాజేంద్ర సింగ్ గా తేల్చారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: