శోభనం రోజే వరుడికి షాక్ ఇచ్చిన వధువు..ఆ తర్వాత..
అలా శోభనం ఒక వారం వాయిదా వేసింది. కుటుంబ సభ్యులతో పాటు భర్త కూడా తన ఆశలను చంపుకుని వాయిదా వేసుకున్నారు. ఆ వారం తర్వాత అందరికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.అత్తగారి ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతోపాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో మూటకట్టుకుని తెల్లారేసరికి పరారీ అయింది. ఉదయం ఇంట్లో కొత్త కోడలు కనిపించకపోవడంతో అత్తమామలు అంతా వెతికారు. అయినా ఆచూకీ దొరకలేదు. ఇంట్లో చూడగా.. నగలు, నగదు కనిపించలేదు. దీంతో మోసపోయామని గ్రహించి వెంటనే వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఫొటోలు, తెలిసిన వివరాలను అందించాడు..
ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించారు. ఈ కోణంలో నమ్మలేని విషయాలను బయట పెట్టారు.ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దొంగ వధువు లలిత.. మరి కొంతమందితో ముఠాగా ఏర్పడి దొంగ వివాహాలు చేసుకుంటూ మోసం చేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్యాంగ్‌లోని సభ్యులే నకిలీ ఐడీలో మ్యాట్రిమోనిల్లో ఫొటోలు పెడుతూ మోసాలకు పాల్పడుతారని వెల్లడించారు.వీరంతా ఒక కుటుంబం లాగా మారి ఇలాంటి మొసాలను చేస్తున్నారని ,ఇలాంటివి నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు..