ఓరినాయనో.. 160 కీ 174 మార్కులు.. ఎలా సాధ్యమబ్బా?

praveen
సాధారణంగా విద్యార్థులకు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు కొంత మంది విద్యార్థులు మాత్రమే ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటూ వుంటారు . ఇక అలా ఫుల్ మార్కులు తెచ్చుకున్న వారినే టాపర్స్ అని కూడా పిలుస్తుంటారు. మరికొంతమంది పాస్ అయినా కూడా ఫుల్ హ్యాపీగా బిందాస్ గా ఉంటారు అనే చెప్పాలి. అది సరే కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ గురించి మార్కుల గురించి ఎందుకు మాట్లాడు కోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్. సాధారణంగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాసినప్పుడు టీచర్లు మార్కులు ఎలా వేస్తారు అన్న విషయం అందరికీ తెలుసు.

 అటు విద్యార్థులు ఎన్ని జవాబులు సరిగ్గా రాస్తే అన్ని మార్కులు వేస్తూ ఉంటారు. కొంతమంది బాగా ఎగ్జామ్ రాస్తే ఫుల్ మార్కులు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఉపాధ్యాయులకు మాత్రం విద్యార్థులపై ప్రేమ కాస్త ఎక్కువ అయిందేమో అని అనిపిస్తూ ఉంటుంది.  ఎందుకంటే ఫుల్ మార్క్స్ వేయడం కాదు ఉన్న మార్కుల కంటే ఎక్కువగానే మార్కులు వేశారు. దీంతో విద్యార్థులకు ఉపాధ్యాయుల వేసిన మార్కులు చూసి తల్లిదండ్రులు షాక్ లో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏకంగా అక్కడ ఉన్నవి 160 మార్కులు అయితే ఉపాధ్యాయులు వేసింది మాత్రం 174 మార్కులు.

 గుజరాత్ బిళదా తాలూకాలోని ఒక స్కూల్లో టీచర్ల నిర్వాహకానికి అటు విద్యార్థులు అందరూ షాక్ అయ్యి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జబ్బిత రాయ గ్రామంలో ఒక స్కూల్ విద్యార్థికి గరిష్ట మార్కులు కంటే ఎక్కువ మార్కులు వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. గుజరాతి లో 160 కి 173,  s&t  లో 160ki 171 మార్కులు వచ్చినట్లు ఒక విద్యార్థికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు ఉపాధ్యాయులు. ఇది చూసి షాక్ అయిన తల్లిదండ్రులు వెంటనే టీచర్లను సంప్రదించి ఇదేంటి అంటూ నిలదీశారు. సాఫ్ట్వేర్ సమస్యల వల్లే ఇలా జరిగింది అని చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఇక అచ్చం ఇలాగే మరో స్కూల్లో కూడా 160 కి 174 మార్కులు వేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: