ఓరి నాయనో.. ఈ వివాహిత ఇంత పని చేసిందేంటి?

praveen
ఇటీవలి కాలంలో కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వని మనుషులు చేయకూడని దారుణమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఏకంగా కలకాలం కష్టసుఖాల్లో కలిసి ఉంటాము అంటూ ప్రమాణం చేసిన వారే పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి క్షణకాల సుఖం కోసం కట్టుకున్న వారిని హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే.  తాము చేస్తున్నdi తప్పు అని తెలిసినప్పటికీ వెనకా ముందు ఆలోచించకుండా హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలా ఇటీవల కాలంలో ప్రేమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలకు సంబంధించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 ఇటీవలే ఓ భార్య ఇలాంటిదే చేసింది. ప్రియుడితో రాసలీలల కు అడ్డు గా ఉన్నాడు అని భావించి చివరికి కట్టుకున్న భర్తను హతమార్చింది.  ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ధర్మవరం లోని దుర్గ నగర్ కు చెందిన గంగాధర్ కు 24 సంవత్సరాల క్రితం లక్ష్మీదేవి అనే మహిళతో వివాహం జరిగింది. అయితే బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు గంగాధర్. అయితే ఇటీవలే స్థానికంగా ఉన్న ముత్యాలు, పుల్లక్క, నాగేష్ సహా మరికొందరి దగ్గర 8 లక్షల అప్పులు తీసుకున్నాడు గంగాధర్. అది కూడా అధిక వడ్డీకి. భార్య చీరల వ్యాపారం చేసుకునేందుకు ఈ అప్పుడు సమకూర్చాడు.


 అయితే సవ్యంగా ఉండాల్సిన భార్య కాస్త తారక రామ పురానికి చెందిన నారా భాస్కర్ రెడ్డితో వివాహేతర సంబంధానికి తెర లేపింది. ఈ విషయం ఓ రోజు భర్త గంగాధర్ కు తెలిసింది. తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఇక భార్య తీరుతో మనస్థాపంతో మద్యానికి బానిస గా మారిపోయాడు గంగాధర్. ఈ క్రమంలోనే ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని లక్ష్మీదేవి నిర్ణయించుకుంది. అన్న వెంకటేష్ అల్లుడు సుధాకర్ కు డబ్బు ఆశ చూపి వారి సాయంతో దారుణంగా హత్య చేసింది. తర్వాత అప్పులు ఇచ్చిన వారు హత్య చేశారు అంటూ కొత్త నాటకానికి తెర లేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: