డ్రైవర్ అంటే ఇష్టం.. భర్త అంటే కష్టం.. చివరికి?

praveen
ఆధునిక సమాజంలో అడుగుపెడుతున్న మనిషి ఎందుకో మానవ సంబంధాలను మాత్రం మర్చిపోతున్నాడు. బంధాలకు బంధుత్వాలకు విలువ ఇవ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వావివరుసలు మరిచిపోయి పడక సుఖం కోసం నీచాతి నీచమైన పనులు చేస్తూ ఉండటం  వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న దారుణ ఘటనలు రోజురోజుకు వెళ్ళిపోతున్నాయ్.


 ఎంతో అన్యోన్యంగా ఆదర్శంగా ఉండాల్సిన భార్యాభర్తలు బంధం అక్రమ సంబంధాల కారణంగా బీటలు వారుతు ఉండటం చూస్తున్నాం. పరాయి వ్యక్తుల ఆకర్షణలో పడుతున్న ఎంతోమంది చివరికీ కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటన జరిగింది ఒడిశాలో. ఇంజనీర్ భార్య తన డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో సుఖానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించి కాంట్రాక్ట్ కిల్లర్ ద్వారా అతడి ని చంపడానికి ప్లాన్ వేసింది. ఈ విషయం కాస్త బయటకి వచ్చి సంచలనంగా మారడంతో తనకు తన భర్త చెప్పినట్లుగా వివాహేతర సంబంధం లేదని.  తన భర్త కు ఎంతో మంది అమ్మాయిలతో ఏఫైర్స్ ఉన్నాయి అంటూ సంచలన విషయాలను వెల్లడించింది.


 ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీశ్లీల అనే మహిళాకు కొన్నేళ్ల క్రితం బినాయక్ బెహ్ర అనే ఒక ఇంజనీర్ తో వివాహం జరిగింది. ఇటీవలే వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఎఫైర్ కారణంగానే మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది. 2020 నుంచి భార్యాభర్తలిద్దరూ వేరుగానే ఉంటున్నారు. పెద్దలు కలగ చేసుకున్న  వీరిద్దరు మాత్రం కలిగి ఉండడం లేదు.  ఇక ఇటీవలే బినాయక్ బెహ్ర పై హత్యాయత్నం జరిగింది. దీనిపై వినాయక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భర్త.. తన భార్యకు డ్రైవర్ కు వివాహేతర సంబంధం ఉందని అందుకే తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. ఈ క్రమంలోనే ముందుకు వచ్చిన అతని భార్య తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఇదంతా ప్రూఫ్ తో సహా నిరూపిస్తానని అంటు చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: