పరీక్షల్లో కాపీ కొడుతున్నాడని.. చెయ్యి కొరికిన టీచర్.. చివరికి?

praveen
సాధారణంగా పరీక్షలు వచ్చాయంటే చాలు అప్పుడు వరకు కాలేజీ కి వెళ్లిన విద్యార్థులు సైతం పుస్తకాల పురుగులు గా మారి పోతూ ఉంటారు. కేవలం నెల రోజుల్లోనే సబ్జెక్టు మొత్తం చదివేయాలి అని భావిస్తూ ఉంటారు. అయితే కొంతమంది కష్టపడి చదివి పాస్ కావాలి అనుకుంటే మరి కొంతమంది విద్యార్థులు మాత్రం ఇక తమ వెంట స్లిప్స్ తీసుకువెళ్లి కాపీ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పరీక్ష కేంద్రాల్లో ఉండే ఇన్విజిలేటర్లకు దొరకకుండా కాపీ కొట్టడం కి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 అయితే కొన్ని కొన్ని సార్లు చివరికి దొరికిపోయి డిబార్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు కాపీ కొడుతున్నారా లేదా అని అధ్యాపకులే ఇన్విజిలేటర్లు గా మారి  పరిశీలిస్తూ ఉంటారు. ఎవరైనా కాపీ కొడుతున్నట్లు అనుమానం వస్తే చెక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కాపీ కొడుతున్నట్లు తెలిస్తే వారిని మందలించడం లేదా పరీక్ష రాయకుండా బయటికి పంపించడం చేస్తూ ఉంటారు. పరిస్థితి మరీ విషమిస్తే డీబార్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం చాలా విచిత్రమైనది అనే చెప్పాలి. విద్యార్థి కాపీ కొడుతున్నాడూ అన్న కోపం తో ఏకంగా విద్యార్థినీ కొరికాడు ఉపాధ్యాయుడు.

 శివమొగ్గ జిల్లా హోసనగర్ తాలూకా డిగ్రీ కళాశాలలో బీఏ పరీక్షల్లో విద్యార్ధి కాపీ కొడుతున్నాడు అన్న విషయాన్ని గ్రహించాడు అధ్యాపకుడు. ఎందుకు కాపీ కొడుతున్నావ్ అంటూ ప్రశ్నించగా.. అతను చెప్పిన సమాధానం నచ్చలేదు. దీంతో కోపంతో ఏకంగా అతని చేయి కొరికేసాడు అధ్యాపకుడు. దీంతో అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే కాపీ కొడుతున్న సమయంలో అధ్యాపకుడూ విద్యార్థులను మందలించగా.. ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ఆగ్రహానికి గురైన అధ్యాపకుడు ఇక ఇలా చేయి కోరినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజులకు ముందు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: