అర్ధరాత్రి తమ్ముడి గదిలో లైట్.. ఏంటా అని చూసిన అక్క.. చివరికి?

praveen
ఆ కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా భోజనం చేసి నిద్ర పోయారు. ఇంతలో అర్ధరాత్రి సమయంలో యువతికి మేలుకువ వచ్చింది.. లేచి చూస్తే తమ్ముడి గది లో లైట్ వెలుగుతూనే వుంది. దీంతో సదరు యువతికి అనుమానం కలిగింది. ఏం జరిగి ఉంటుందా అని ఇక తమ్ముడు గది లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ గడియపెట్టి ఉంది.. దీంతో కిటికీలోంచి చూసింది. దీంతో అక్కడ జరిగిన ఘటనతో ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయింది ఆ యువతి. ఎందుకంటే తమ్ముడు ఏకంగా గదిలో ఉరికి వేలాడుతూ కనిపించాడు.

 రాజస్థాన్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గంగాపూర్ లోని రామ్ రహీమ్ ప్రాంతంలో సంసుద్దీన్ కుటుంబం ఉంటుంది. కొడుకు కూతురితో ఉంటున్నాడు. అయితే వీళ్లంతా ఎప్పటిలాగానే రాత్రి సమయంలో భోజనం చేసి పడుకున్నారు. ఇక ఆ తర్వాత ఎవరి గదిలోకి వారు వెళ్ళి నిద్ర పోయారు. అర్ధరాత్రి సమయంలో సడన్గా సంసుద్దీన్ కూతురికి మేలుకువ వచ్చింది. ఈ క్రమంలోనే అదే సమయంలో తమ్ముడు భారీష్ ఖాన్ గదిలో లైట్ వెలుగుతూ ఉండటాన్ని గమనించింది ఆమె. ఈ టైం వరకు తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అనుమానంతో తలుపు తెరిచేందుకు ప్రయత్నించింది.
 కానీ లోపల నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో మరింత అనుమానం కలిగింది. ఇక వెంటనే కిటికీ లోంచి వెళ్లి గదిలోకి చూసింది. ఒక్కసారిగా షాక్. ఉరికి వేలాడుతున్న తమ్ముడు శవాన్ని చూసి గట్టిగా కేకలు వేసింది. ఈ శబ్దానికి ఇంట్లో వారందరూ నిద్రలేచి అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. ఇక తలపులు బద్దలుకొట్టి ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు. అయితే అతను మద్యానికి బానిసగా మారాడని రాత్రి కూడా ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడని.. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: