భార్యను అతి దారుణంగా చంపిన భర్త.. చివరికి..
వివరాల్లొకి వెళితే.. అనంతపురం లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని ధర్మవరం లో వెలుగు చూసింది.కూరగాయలు తీసుకురామని చెప్పినందుకు భార్యపై భర్త కొడవలితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మవరం లోని లక్ష్మణస్వామి, రత్నమ్మ ఇద్దరు దంపతులు మగ్గం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు..రెక్కాడితేగాని డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి. కూరగాయలు తీసుకురావాలని భర్తకు రత్నమ్మ తెలపడంతో డబ్బులిస్తే వెళతానని భర్త అన్నాడు.
డబ్బులు లేవని ఎంత వారించిన కూడా అతను వినలేదు.భర్తకు చెప్పడంతో భార్య భర్త ల వద్ద గొడవ జరిగింది. కనీసం కూరగాయలు తీసుకురావటానికి కూడా డబ్బులు లేవంటే ఎలా అంటూ భర్తతో వాగ్వాదానికి దిగటం తో వారి ఘర్షణ కాస్త పెద్దది అయ్యింది. అయితే ఇద్దరు ఎవరికీ వారే అన్నట్లు ఒకరికి మరొకరుగా మారింది. దాంతో కోపం తో ఊగిపొయిన భర్త పక్కనే వున్న కొడవలి తో అతి దారుణంగా దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. భర్త చేసిన కొడవలి దాడిలో గాయపడిన రత్నమ్మ ను స్థానికులు అనంతపురం లోని వైద్య కళాశాలకు తరలించారు.దాంతో అక్కడే ఆమె ప్రాణాలును కొల్పొయారు. పూర్థి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..