వృద్ధుడు కిరాతకం.. ఆస్తి కోసం ఎంత పని చేసాడు?

praveen
ఇటీవల కాలంలో మనుషులు మానవ మృగాలు గా మారిపోతున్నారు. ఏకంగా సొంత వాళ్ల విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు. ఏకంగా ఆస్తుల కోసం అన్నదమ్ములు ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు కని పెంచిన తల్లిదండ్రులను కూడా దారుణంగా హత మార్చుతున్నారు  నేటి రోజుల్లో. ఆస్తులు అంతస్తులకు ఇస్తున్న విలువ బంధాలకు బంధుత్వాలకు మరీ ముఖ్యంగా మనుషుల ప్రాణాలకు అసలు ఇవ్వడం లేదు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 79 సంవత్సరాల వృద్ధుడుకి ఆస్తి మీద కోరిక పుట్టింది. దీంతో ఏకంగా కొడుకు కోడలు సహా ఇద్దరు మనవరాళ్లకు నిప్పు అంటించి చంపేసాడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.

 అర్ధరాత్రి సమయంలో ఇక అందరూ ఇంట్లో నిద్రిస్తున్న ఉండగా పెట్రోల్ బాటిల్ ను గదిలోకి విసిరి ఇక నిప్పంటించాడు. ఇక ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మంటల్లో సజీవదహనం అయ్యారు అని చెప్పాలి.. ఇడుక్కి ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా  అసలు నిజాన్ని ఒప్పుకున్నా 79 సంవత్సరాల వృద్ధుడు. ఆ వృద్ధుడు తన  కొడుకుతో ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. దీంతో ఏకంగా కన్నకొడుకు పైన కక్ష పెంచుకున్నాడు. ఇక ఇటీవలే మరో సారి కొడుకు తో ఆస్తి విషయంలో గొడవ పడిన హామీద్ అందరూ నిద్రపోతున్న సమయంలో ఏకంగా పెట్రోల్ బాటిల్ ను ఇంట్లోకి విసిరి నిప్పంటించాడు.

 ఈ క్రమంలోనే నిప్పులు ఆర్పేందుకు నీళ్లు రాకుండా ఉండేందుకు ట్యాప్ కూడా రాకుండా బంద్ చేశాడు. ఇక పక్కాగా ప్లాన్ వేసుకొని చివరికి మర్డర్ కు పాల్పడ్డాడు. అయితే ఏకంగా ఆస్తి విషయంలో కన్న కొడుకుని తండ్రి చంపేయడం గురించి తెలిసి కుటుంబ సభ్యులే కాదు స్థానికులు అందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఇక పోలీసుల విచారణలో అన్ని నిజాలు హమీద్ బయటపెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: