పెళ్ళి చేసుకోనెందుకు ఉద్యోగి ఏం చేశాడో తెలుసా?

Satvika
ఇప్పుడు పెళ్ళి జరగాలంటే ఏది తక్కువ కాకూడదు అని చాలా మంది అనుకుంటారు.. అంతే కాదు పెళ్ళి జీవితంలో ఒక్కసారే చెసుకుంటారు మనం పెళ్ళి చేసుకుంటే పది ఊర్లు గొప్పగా చెప్పుకొవాలి అని అందరూ అంటున్నారు.. అదే విధంగా డబ్బులు ఉన్నంతలో అంగరంగ వైభవంగా జరుపుతారు. అయితే మన సొమ్ముతో చేసుకుంటే అది మంచి పద్దతి కానీ డబ్బులు కోసం మనం పని చేస్తున్న కార్యాలయానికి కర్ణం వేస్తే ఎంతవరకు న్యాయం అని అందరూ ఆలొచిస్తున్నారు కదా.. అవును మీరు విన్నది అక్షరాల నిజమే..


ఓ వ్యక్తి తను పనిచేస్తున్న బ్యాంక్ కు కర్ణం వేశాడు. పెళ్ళి మాట దేవుడు ఎరుగు ఇప్పుడు బండారం బయట పడటంతో ఊసలు లెక్క పెడుతున్నారు. వివరాల్లొకి వెళితే.. ఈ వింత ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది..తన పెళ్ళి రిచ్ గా చేసుకోవాలి అని అనుకున్నాడు. తను బ్యాంక్ లో పని చేస్తున్నాడు. అవసరానికి బ్యాంక్ డబ్బులను వాడుకోవాలి అప్పుడే పెళ్ళి ఘనంగా జరుగుతుంది అని భావించాడు. అదే అదునుగా బ్యాంక్ లో తన చేతిలో ఉన్న బంగారం, డబ్బులను దొచుకున్నాడు.. అయితే పెద్ద మొత్తంలో డబ్బులు మాయం అవడం ఆరా తీసిన బ్యాంక్ యాజమాన్యానికి ఒకింత షాక్ తగిలింది...


అతను బ్యాంక్ లో డబ్బులను తీసుకున్నాడు. విషయాన్నికొస్తే.. కర్ణాటకలోని బెళగావి జిల్లా సవదత్తి తాలూకా మురుగోడు డీసీసీ బ్యాంక్‌లో మార్చి 6న రూ.ఆరు కోట్ల విలువ గల బంగారం, నగదును దొంగలు దోచుకెళ్లారు.. అయితే దొంగలను పెట్టి మరి ఇలా చేయడం షాకింగ్ విషయం అనే చెప్పాలి.నాలుగుకోట్ల 20 లక్షల నగదు, రూ. కోటి 63 లక్షల విలువచేసే మూడు కేజీల బంగారు నగలను, ఒక కారు, బైకును స్వాదీనం చేసుకున్నారు. నకిలీ తాళాల్ని ఉపయోగించి క్లర్క్‌ బసవరాజు, అతని స్నేహితులతో కలిసి బ్యాంకు దోపిడీ చేసినట్లు తేలింది. ఆ డబ్బులను తీసుకెళ్ళి పొలంలో పాతి పెట్టారు.. చివరికి పోలీసులు ఎంటర్ అవ్వడం తో అసలు విషయం బయటపడింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: