డాక్టర్లు చేయమన్నారని అలా చేశాడు.. ప్రాణం పోయింది?

praveen
కొన్ని కొన్ని సార్లు ప్రతి మనిషి జీవితంలో అనుకోని సంఘటనలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి. ఊహించని రీతిలో మృత్యువు ముంచుకొస్తు ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకే వస్తూ ఉంటుంది  దేశం కాని దేశం లో స్విమ్మింగ్ పూల్ లో పడి హైదరాబాద్ నగరానికి చెందిన యువకుడు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆస్ట్రేలియాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెజిమెంటల్ బజార్ కు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయాడు. శ్రీనివాస్ అరుణ దంపతులకు సాయి సూర్య తేజ కుమారుడు ఉన్నాడు.

 2019లో ఎమ్మెస్ చదివేందుకు ఆస్ట్రేలియా కి వెళ్ళాడు ఇక చదువు పూర్తి కావడంతో రెండు నెలల క్రితమే సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరాడు. ఇకపోతే ఇటీవలే ఆస్ట్రేలియా నుండి బ్రిస్బేన్ లో తాను నివాసం ఉంటున్న గోల్డెన్ కాస్ట్ రిసార్ట్ లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అయితే 2020లో సాయి సూర్య తేజ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.  ఈ ప్రమాదంలో అతని కాలు ఫ్రాక్చర్ అయింది. శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ఇక వచ్చే నెలలో అతనికి మరో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ శస్త్ర చికిత్సకు ముందు తరచూ స్విమ్మింగ్ చేస్తే మరింత మెరుగ్గా ఉంటుంది అంటూ వైద్యులు సూచించారు..

 ఇక వైద్యుల సూచన మేరకు ఈ నెల ఏడవ తేదీన తన అపార్ట్మెంట్ కింద ఉన్న స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళాడు. ఇక ప్రమాదవశాత్తు నీటిలో మునిగి సాయి సూర్య తేజ మృతి చెందాడు. అయితే వచ్చే నెలలో సాయి సూర్య తేజ శాస్త్ర చికిత్స ఉండటంతో తల్లిదండ్రులు కూడా ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ అంతలోనే కుమారుడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో తల్లిదండ్రులు గుండె పగిలిపోయింది. దీంతో బోరున విలపించారు. ఇక ఈ నెల 14,15 తేదీలలో మృతదేహం నగరానికి తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: