కర్నూలు లో ఘోర ప్రమాదం.. డ్రైవర్ మృతి..
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన ఎపిలో ఆంధ్రప్రదేశ్ జరిగింది. రాష్ట్రంలోని కర్నూలు జిల్లా లో జరిగింది. ముందు వెళుతున్న వాహానాన్ని తప్పించబోయి ఓవర్ టేక్ చేసాడు. అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి పక్కనే వున్న పొలాల వైపు దూసుకుపోయింది. పక్కనె వున్న బావిలోకి వెళ్ళింది. ఎమ్మిగనూరు మండలం ఎర్ర కోట గ్రామ దగ్గర ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. హ్యూందాయ్ క్రెటా కారు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు మీదుగా వెళ్తోంది. ఈ క్రమం లో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్నా సమయం లో బావిలొకి వెళ్ళిపోయింది..
కారు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు మీదుగా వెళ్తోంది. ఎర్రకోట గ్రామం సమీపం లో ముందుగా ఉన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సందర్భం లో కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.. అది గమనించిన వాళ్ళు వెంటనే పోలీసు స్టేషన్ కు కాల్ చేశారు. ఒక్కసారిగా బావి లోకి దూసుకెళ్లడం తో 15 మీటర్ల లోతులో మట్టిలో ఇరుక్కుంది. గజ ఈతగాళ్ళ సాయం తో కారును బయటకు తీసారు. కారు డ్రైవర్ రామంజి మృతి చెందాడు. కారులో ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.