ఇదెక్కడి చోద్యం ?...కొట్టి చంపినా కేసు లేదు ! ఎక్కడో తెలుసా?

Vennelakanti Sreedhar

ఒక మనిషిని చంపడం నేరం. అది ఎవరైనా సరే... ఇది భారత రాజ్యాంగం చెపుతున్న సూత్ర మొక్కటే కాదు...మానవీయ్యత కూడా. భారత్ తో సహా పలు దేశాలలో ఉరిశిక్ష ను రద్దు చేయాలంటూ ఉద్యమాలు జరుగుతున్నాయి. హత్య కు హత్య సమాధానం కాదనే కూడా వాదనలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ చర్చలను కాసేపు  పక్కన పెడుదాం. ఒక వ్యక్తికి దారుణంగా కొట్టి చంపారు. కారణం ఏదైనా కావచ్చు. ఈ విషయం ప్రసార మాధ్యమాలలో  ప్రసారం  అయింది కూడా. చోద్యం ఏమిటంటే  నిందితులపై ఇంత వరకూ  పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయక పోవడం.
కపుర్తలా లోని నిజాంపూర్‌లోని ఒక గురుద్వారా వద్ద ఒక వ్యక్తిని హత్య చేసిన తర్వాత...  ఇంకోక వ్యక్తి  పై హత్యాయత్నానికి ప్రయత్నించారు,  ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద ఎటువంటి  ఎఫ్ ఐ ఆర్ నమోదు కాలేదు.
ఈ సంఘటన ప్రత్యక్ష ప్రసారం అయింది. కానీ , తదుపరి చర్యలు తీసుకునే ముందు శవపరీక్ష నివేదిక కోసం వేచి ఉన్నామని పోలీసులు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.
సెక్షన్ 295-ఎ (మతాన్ని అవమానించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన కొత్వాలీ పోలీస్ స్టేషన్   బేలగా కనిపించింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్  హాజరుకానప్పటికీ, పోలీసులు తమ స్వంత “భద్రత” కోసం గేటును మూసివేసినట్లు చెప్పారు. కపుర్తలా లోని  పోలీసు ఉన్నతాధికారి  ఖాఖ్ మాట్లాడుతూ, “సెక్షన్ 302 ఇంకా జోడించబడలేదు. మరణించిన వారి కుటుంబ సభ్యులెవరూ కూడా జాడలేదు అని తెలిపారు.  లాక్ చేసిన గేటు విషయం పై ఆయన “ఇది తాత్కాలిక చర్య అని అభివర్ణించారు.  పోలీసులు ఈ విషయం పై విచారణ చేస్తున్నట్లు సమాధానం ఇచ్చారు.
కపుర్తలా సివిల్ హాస్పిటల్   డాక్టర్ సందీప్ ధావన్ మాట్లాడుతూ, “శవపరీక్ష ఇంకా నిర్వహించాల్సి ఉంది. అధికారిక విచారణ తర్వాత గాయాల స్వభావానికి సంబంధించి ప్రకటన చేస్తామని చెప్పారు.
గురుద్వారా కు సంబంధించిన ముఖ్యుడు,   ఫిర్యాదుదారుడు అమర్‌జిత్ సింగ్ నిందితులను గుర్తించినప్పుడు అతను పారిపోవడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. “నేను పైకి వెళ్లి, పవిత్ర గ్రంథం చెక్కుచెదరకుండా చూసాను, కానీ నిషాన్ సాహిబ్ విప్పబడి ఉంది. నిందితుడిని పట్టుకున్నాం. అతను తన పేరు , ఇతర వివరాలను వెల్లడించలేదు అని  తెలిపారు, “సంఘటన జరిగిన వెంటనే, కొన్ని కాల్స్ చేయడంతో పాటు, నేను గురుద్వారా లౌడ్ స్పీకర్ నుంచి ప్రజలను గుమికూడమని కోరుతూ ఒక ప్రకటన చేసాను.  మనిషి చనిపోవడం నేను చూడలేదు. అని సమాధానం ఇచ్చారు...ప్చ్...ఇదెక్కడి చోద్యం !...కొట్టి చంపినా కేసు లేదు !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: