దారుణం : పిల్లలు పుట్టాలని మహిళ చేత ఏమి తినిపించారో తెలిస్తే షాక్‌..!

N ANJANEYULU
రోజు రోజుకు మూడ న‌మ్మ‌కాలు మితిమీరుపోతున్నాయి. మొన్న‌టికి మొన్న వ‌రుస‌కు అమ్మమ్మ‌, తాత‌య్య కావాల్సిన వారు పాపం అభం శుభం తెలియ‌ని ఆరు నెల‌ల ప‌సిపాప‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. ఈ మూడ నమ్మ‌కాల‌ను పార‌దోలాల‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నిస్తున్నా కానీ అది అమ‌లుకు నోచుకోవ‌డం లేదు. కొంత మంది మూఢ‌న‌మ్మ‌కాలు అని వాదిస్తున్నా.. వారిని వాదించ‌కుండా మ‌రికొంత మంది నీకు ముప్పు ఉంటుంద‌ని బెదిరించ‌డంతో వారు అంత‌టితోనే ఆగిపోవాల్సి వ‌స్తుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు దేశ‌వ్యాప్తంగా త‌రుచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
కొంత మంది పిల్ల‌ల‌ను పుట్టిస్తామ‌ని.. మ‌రికొంద‌రూ ద‌య్యాన్ని వ‌దిలిస్తాం.. అని.. నీకు మంచి చేస్తామ‌ని మ‌రొకొంద‌రూ ఇలా కార‌ణం ఏదైనా కానీ.. వారు చెప్పేది ఒక్క‌టే మీకు ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చివ‌రికీ చాలా వ‌ర‌కు మోస‌పోవ‌డం.. లేక‌పోతే పారిపోవ‌డం..ఇలాంటివి త‌రుచూ చోటు చేసుకూనే ఉంటున్నాయి. అయితే తాజాగా ఈ మూఢ‌న‌మ్మ‌కం వ‌ల్ల ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న గుంటూరు జిల్లాలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన‌ది.
 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని  గుంటూరు జిల్లా తూబాడుకు చెందిన ఆటో డ్రైవ‌ర్ ర‌వికి రెండేండ్ల కింద‌టే స‌న్నిత‌తో వివాహం జ‌రిగింది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు స‌న్నితకు క‌డుపు పండ‌లేదు. ఆమెకు సంతానం క‌ల‌గాల‌ని ఎన్నో గుడులు, గోపురాలు తిరిగినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు. దీంతో ప‌లువురుని ప‌లుమార్లు ఎక్క‌డికి వెళ్లితే సంతానం క‌లుగుతుంద‌ని సంప్ర‌దింపులు జ‌రిపారు.
ఈ  త‌రుణంలోనే బంధువులు వేరొక మ‌హిళా ప్ర‌స‌వించిన బొడ్డు ఆడు తింటే వెంట‌నే పిల్ల‌లు క‌లుగుతారు అని చెప్పింది. వెంట‌నే డిసెంబ‌ర్ 13న  అనుకున్న‌ట్టుగానే ఓ మ‌హిళ ప్ర‌స‌వించ‌డంతో.. ఆమెకు సంబంధించిన‌ బొడ్డుపేగును తీసుకొచ్చి  కుటుంబ స‌భ్యులు స‌న్నిత‌కు తినిపించారు. అది తిన్న రెండు రోజుల‌కే స‌న్నిత అనారోగ్యానికి గురైంది. వెంట‌నే ఆమెను చికిత్స కోసం ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా చికిత్స పొందుతూ మృఇ చెందింది. త‌న కుమార్తెను అత్తింటివారు త‌రుచూ వేధిస్తూ ఆమె చేత విష‌ప‌దార్థం తినిపించి హ‌త్య చేసారంటూ.. స‌న్నిత త‌ల్లిదండ్రులు ఆరోపిస్తూన్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని.. ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.
 
 
 





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: