అయ్యో: ఈమెకు ఎందుకిలా జరిగింది..?

N.ANJI
ప్రస్తుత సమాజంలో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని రాజపాళయంలో పట్టపగలు ఓ మహిళ దారుణ హత్యకు గురైయ్యారు. ఈ సంఘటనతో రాజపాళయంలో కలకాలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విరుధునగర్ జిల్లా రాజపాళయంలోని దురైస్వామిపురం వీధిలో గణేశన్ కుటుంబం నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే  ఇంద్రాణి, గణేశన్‌కి కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరిద్దరికి కొడుకు, ఒక కూతురు ఉన్నారు. జీవనోపాధి కోసం గణేశన్‌కు ఓ కిరాణా దుకాణంను నడిపిస్తున్నారు.

అయితే ఆ భార్యాభర్తలిద్దరూ ఆ షాప్ చూసుకుంటూ పిల్లల్ని చదివిస్తున్నారు. కాగా గణేశన్ కూరగాయలు తీసుకొచ్చేందుకు మార్కెట్‌కు వెళ్ళాడు.. ఇక  భర్త లేని సమయంలో దుకాణం చూసుకుంటుండే ఇంద్రాణి ఎప్పటిలానే దుకాణంలో కూర్చుని షాప్ చూసుకుంటుంది. అయితే బయట వర్షం పడుతూ ఉండటంతో రోడ్డుపై కూడా ఎవరూ పెద్దగా జనాలు తిరగడం లేదు. ఈ తరుణంలో ఇంద్రాణి దుకాణంలో ఉండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ షాప్‌లోకి వెళ్లి ఇంద్రాణి గొంతుకోసి అక్కడి నుంచి పరారైయ్యారు.

ఆ సమయంలో పిల్లలు కూడా ఇంట్లో ఉండటంతో షాప్‌లో తల్లి రక్తపు మడుగులో పడి ఉన్న విషయాన్ని గమనించలేకపోయారు. ఇక మార్కెట్‌కి వెళ్లిన ఆమె భర్త అక్కడి నుంచి భార్య ఇంద్రాణికి ఫోన్ చేశాడు. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసి ఒక్కసారి తన భార్యకు ఫోన్ ఇవ్వాగలరా అని కోరగా.. ఆ వ్యక్తి దుకాణానికి వెళ్లి చూడగా ఇంద్రాణి రక్తపుమడుగులో పడిఉండటం గమనించారు. దీతో అతడు ఒక్కసారిగా షాకి గురైయ్యారు.

అతను వెంటనే తన భర్తకి సమాచారం అందించగా.. గణేశన్ హుటాహుటిన మార్కెట్ నుంచి షాప్‌కు వచ్చి చూసేసరికి ఆమె భార్య తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: