మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి.. కారణం..?

MOHAN BABU
దేశంలో ప్రతి రోజు ప్రతి గంటకు ప్రతి నిమిషానికి ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు అనేది జరుగుతూ ఉన్నాయి. దేశంలో ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఇది మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇంకా కఠిన చట్టాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అసలు ఈ మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి.. తెలుసుకుందాం..?
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఆగడాలు  పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. ఆడది కనిపిస్తే చాలు కామోన్మాదులు రెచ్చిపోతున్నారు. బాధితులు ధైర్యంగా బయటకు రాలేరన్న నమ్మకమే కామోన్మాదులకు ఆయుధంగా మారుతుంది. కామపిశాచులు చెలరేగిపోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. దిశ లాంటి ఘటన చట్టాలు అమలులోకి వచ్చిన వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. కర్నూలు జిల్లా మంత్రాలయం లో  దారుణం జరిగింది. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన మైనర్ బాలికను మఠం ఉద్యోగి దామోదర్ స్వామి లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో కీచక  రైల్వే కాంట్రాక్ట్ సూపర్వైజర్ బాగోతం బట్టబయలైంది.

తాను చెప్పినట్లు వినకుంటే జీతం ఇచ్చేది లేదంటూ వేధించిన కాంట్రాక్ట్ సూపర్వైజర్ గుణశేఖర్ పై మహిళా సంఘాలకు ఫిర్యాదు చేసింది కార్మికురాలు. లాడ్జి కి రప్పించి చితకబాదిన మహిళలు, తర్వాత తిరుచానూరు పోలీసులకు అప్పగించారు. పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజీ గూడెం  పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రంగ నాయక్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనపై రంగనాయక అత్యాచారం చేశాడంటూ ఏలూరుకు చెందిన మహిళ దిశా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల ఒకటో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వాలంటీర్ యామిని తనని స్థానిక ఎంపీటీసీ ఎల్లారావు వేధిస్తున్నట్లు వీడియో ద్వారా సీఎం జగన్ కు విన్నవించుకుంది. తాను దళిత వర్గానికి  చెందిన అమ్మాయినని తన ప్రియురాలి కుమార్తెను నియమించేందుకే వేధింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: