ఎంత పని చేశారయ్యా ! ??

Vennelakanti Sreedhar
ఎంత పని చేశారయ్యా  ! ??
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకో లేడు అనేది పూర్వీకుల నుంచి జనబాహుళ్యంలో ఉన్న నానుడి.  ప్రస్తుత డిజిటల్ విప్లవ కాలంలో  ఇది సాధ్యం అవుతుందా ? ఖచ్చితంగా కాదు. ఎలాంటి చోరీలకు అవకాశం ఉండదు. దొంగ ఎప్పటికయినా దొరకాల్సిందే, శిక్షనుంచి తప్పించుకోలేరు. ఇక అసలు విషయానికి వద్దాం. భారత రక్షణకు సంబంధించిన రహస్యాలను దాయాది దేశం పాకిస్తాన్ చేరవేసే క్రమంలో నలుగురు డి.ఆర్.డి.వో ఉద్యోగులు తమ పై అధికారులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసు విచారణ ఎదుర్కోంటున్నారు.
ఒడిశాలోని చాందీపూర్ అనే ప్రాంతంలో డి.ఆర్.డి.వో కేంద్రం ఉంది. ఆ రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లా పరిధిలోోకి చాందీపూర్ వస్తుంది. అక్కడి ఇంటిగ్రెటెడ్ టెస్ట్ రేంజి ( ఐ.టి.ఆర్)లో  పని చేస్తున్న సిబ్బంది  దేశ రక్షణ రహస్యాలను ఇతర దేశాలకు  అందజేస్తు  పై అధికాలకు దొరికారు. సహజంగానే  అక్కడ పని చేసి సిబ్బంది పై క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకూ వారి కార్యకలాపాలపై నిఘా ఉంటుంది. నిఘా అధికారులకు అక్కడి పని చేస్తున్న హేమంత్ కుమార్ మిస్త్రీ,  వసంత్ బెహరా, షేక్ ముషాఫిర్ లు ఇటీవలి కాలంలో ఎక్కువగా విదేశాలకు చెందిన వ్యక్తులతో టెలిఫోన్ సంభాషణలు జరిపినట్టు గుర్తించారు. వారి తాలూకు వ్యక్తులను నేరుగా కలిసినట్టు నిఘా అధికారుల దృష్టికి వచ్చింది.
  దీంతో ఆ రాష్ట్ర ఐ.జి హీమాంసు  రంగంలోకి దింపారు. ఐ.జి బాలేశ్వర్ ఎస్.పి సుధాంశు మిశ్రా నేతృత్వం లో రహస్య విచారణ జరిపారు. ఇందుకోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.  పోలీసుల విచారణలో చాలా విషయాలు వెలుగు చూశాయని, రక్షణకు సబంధించినందున అన్ని విషయాలు వెల్లడించలేమని పోలీసులు తెలిపారు.  నిందితులు ముగ్గురూ ఐ.టి.ఆర్ ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ సిబ్బంది రంజన్ నాయక్ ను లోబర్చుకొని రహస్యాలను  వెలుపలికి తీసుకువచ్చారు. పోలీసు బృందాల సోదాల్లో కలక పత్రాలు లభించినట్లు అధికారిక సమాచారం.
 నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. వారి బ్యాంకు ఖాతాను సీజ్ చేశారు. వారి ఖాతాల్లో విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు జమ ఆయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన డి.ఆర్.డి.ఓలో కలకలం రేపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: