ముంబైలో దారుణం: రైల్వే స్టేషన్ లోని ఆ బాలికపై అత్యాచారం..!

MOHAN BABU
ముంబై నగరంలో మరో దారుణం జరిగింది. రైల్వేస్టేషన్లో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ మధ్యకాలంలో మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఈ కామాంధులలో మార్పు మాత్రం రావడం లేదు అని చెప్పవచ్చు. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు రావాలంటేనే వణికిపోతున్న పరిస్థితులున్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలను  తీసుకొచ్చి అమలుచేస్తున్న  ఈ రాక్షసుల్లో మార్పు అనేది కనిపించడం లేదని చెప్పవచ్చు. దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతి నిమిషం ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ మృగాళ్లకు  వయస్సుతో తేడా లేకుండా చిన్న పిల్లల నుండి  ముసలి వాళ్ళ వరకు రక్షణ లేకుండా పోతుంది అని చెప్పవచ్చు. ఈ యొక్క మహిళల కోసం రక్షణ చట్టాలు దిశ, నిర్భయ లాంటివి ఎన్ని తెచ్చిన ఈ రేపిస్టులకు మాత్రం బుద్ధి రావడం లేదు. డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసిన ఫలితం అనేది లేకుండా పోతోంది. ఈ యొక్క అత్యాచార ఘటనలు ఆడపిల్ల తల్లిదండ్రులకు భయాందోళనకు గురిచేస్తున్నాయి.

 ఒక మహిళపై లైంగిక దాడి చేసి ఆమె ఒక ప్రైవేటు శరీరభాగాల్లో  రాడు చోప్పినటువంటి ఘటన మరువకముందే ముంబై నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఉల్ హాస్ నగర్  రైల్వే స్టేషన్ పరిధిలో  ఉన్నటువంటి రైల్వే స్టాఫ్ క్వార్టర్స్ లో 15 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. సదరు బాలిక తన యొక్క ఇద్దరు స్నేహితులతో కలిసి కళ్యాణ్ నుండి లోకల్ ట్రైన్ ఎక్కి ఉల్లాస్ నగర్ లోకి వచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటల  సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పై ఒక వ్యక్తి ఆ మైనర్ దగ్గరికి వచ్చాడు. అతడి చేతిలో సుత్తి కూడా ఉంది. సదరు బాలిక స్నేహితులను బెదిరింపులకు గురి చేశాడు. ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లాలని  వారిని భయపెట్టాడు. వెంటనే భయంతో మిగతా బాలికలు ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు. తర్వాత సదరు వ్యక్తి ఆ మైనర్ ను లాక్కెళ్లి రైల్వే స్టాఫ్ క్వార్టర్స్ లో  అత్యాచారం చేసాడు. శనివారం ఉదయం సదరు బాలిక ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకొని, రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని  స్నేహితులకి ఫోన్ చేసింది. దీంతో ఆ స్నేహితురాలు దగ్గరే ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆ మైనర్ బాలికకు సూచించింది.

 ఆ బాలిక  యొక్క  ఫిర్యాదులను స్వీకరించడానికి ఆ రెండు పోలీస్ స్టేషన్లలో వారు నిరాకరించారు. ఈ కేసు మా పరిధిలోకి రాదని ఆ స్టేషన్ నుండి ఆ బాలికను పంపేశారు. చివరికి రైల్వే పోలీసులే ఫోక్సో చట్టం  పరిధిలో కేసు నమోదు చేసుకొని, సదరు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే ఈ పోలీస్ స్టేషన్లలో కేసు ఎందుకు నమోదు చేసుకోలేదని పోలీస్ కమిషనర్ చాలా సీరియస్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో అధికారులను విచారణకు ఆదేశాలు జారీ చేశారు.  బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. సంఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని కూడా పంపించామని, దర్యాప్తు కూడా కొనసాగుతోందని కమిషనర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: