దొంగ అతితెలివి.. అంతలోనే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు?

praveen
ఈ మధ్యకాలంలో దొంగల బెడద రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది ఉద్యోగమో.. వ్యాపారమో చేసుకునీ సభ్య సమాజంలో గౌరవంగా జీవించడం కంటే ఇక దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుని దోచుకున్న సొమ్ము అమ్ముకొని ఇక  జల్సాలకు చేసేందుకు ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. ఎంతోమంది దొంగలుగా మారిపోతున్నారు. అయితే దొంగలు దొంగతనం చేయాలనుకున్నప్పుడు పక్కా ప్లాన్ వేసుకుంటారు. పోలీసులకు దొరకకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ  కొంత మంది దొంగలు మాత్రం అతితెలివి ప్రదర్శిస్తూ ఉంటారు. చివరికి ఆ దొంగల అతితెలివి పోలీసులకు దొరికిపోయేలా చేస్తూ ఉంటుంది.



 ఇంకేముంది దొంగతనాలు చేసి జల్సాలు చేయాలనుకున్న దొంగలు చివరికి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కా ప్లాన్ ప్రకారం చోరీకి పాల్పడ్డాడు ఆ దొంగ. ఇక చోరీ చేసిన సొత్తును విక్రయించేందుకు ప్రయత్నించాడు. కానీ అతని ప్లాన్ రివర్స్ అయ్యింది. చివరికి పోలీసులకు దొరికిపోయాడు ఇక ఆ తర్వాత పోలీసులు అతని గురించి ఆరా తీస్తే ఊహించని నిజాలు బయటపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఏకంగా 50 చోరీలు మూడు హత్యలు కూడా చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.



 ఇటీవలే కడప టూ టౌన్ పోలీసులు గౌస్ నగర్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కు చెందిన రాజు కార్ లో అటువైపుగా వచ్చాడు. అయితే ఇక ముందు రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అన్న విషయాన్ని గమనించిన రాజు వెంటనే కార్ వెనక్కి తిప్పి రిటర్న్ వెళ్లడం ప్రారంభించారు. గమనించిన పోలీసులు అతన్ని వెంబడించారు. ఈ క్రమంలోనే కొంతదూరం తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఇక పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఇటీవలే రాజంపేటలో ఇంట్లో బంగారు వెండి నగలు అపహరించినట్లు వాటిని ఇక్కడ ఒక షాపులో విక్రయించేందుకు వెళ్తున్నట్లు నిజం ఒప్పుకున్నాడు.  ఇక ఈ విచారణలో అతని పై ఉన్న పాత కేసులు కూడా బయటపడ్డాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: