ప్రస్తుత సమాజంలో ప్రతి పని ట్రెండ్ గా మారింది. అడుక్కునే వారు కూడా టైమ్ టు టైమ్ మెయింటెన్ చేస్తున్నారు. పెద్దపెద్ద విలాసవంతమైన కార్లలో కూడా వచ్చి వారి అడుక్కునే వృత్తిని కొనసాగిస్తున్నారు. వారికి అనుకున్న టార్గెట్ నిండిన తర్వాత మళ్లీ అదే కారులో వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఇలా అడుక్కునే వారి నుంచి దొంగతనాలు చేసే వారి వరకు ప్రతిదీ ఒక ట్రెండీగా మారిపోయింది. ఒకప్పుడు దొంగలు అంటే అదోరకంగా కనబడేవారు. వారిని చూస్తేనే భయం వేసేది. పెద్ద పెద్ద మీసాలు వేసుకొని, ముఖం మీద మచ్చలతో చూడడానికే భయానకంగా కనిపించే విధంగా దొంగలు ఉండే వారని మనకు తెలుసు.
మనం పాత సినిమాలో కూడా చూసాం. అలాంటి పరిస్థితి అలాంటి దొంగలు ఇప్పుడు కనబడడం లేదు. ప్రస్తుతం దొంగలు కూడా మనకంటే బాగా మోడ్రన్ డ్రెస్సులు, సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉన్నారు. ఎంతోమంది ఆన్లైన్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలోనే యూపీకి చెందిన ఈ దొంగలు విమానంలో వచ్చి దొంగతనాలు చేసి ట్రైన్లో పరార్ అవుతున్న ఇద్దరు దొంగలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అర్జున్ సింగ్ 27 సంవత్సరాలు, సోను కుమార్ 32 సంవత్సరాలు, గత నెలలో బెంగళూరు పట్టణ ప్రాంతాల్లో 20 చోట్ల చైన్ స్నాచింగ్ లు చేసిన అనంతరం సజ్జాపురంలో ఉన్నటువంటి తన స్నేహితుని గదికి వెళ్లారు. ఈ విధంగా ఒకే రోజున ఇన్ని కొన్ని చోట్ల చోరీలు జరగడం చూసి పోలీసులు షాక్ అయ్యారు.
దీంతో వారు ప్రత్యేక నిఘా పెట్టి ఉన్నారు. కొద్దిరోజుల్లోనే ఆ నిందితులను పట్టుకున్నారు. మైసూర్ పట్టణంలోని ఒక ఇంట్లో వారందరినీ కట్టేసి నగలు, డబ్బు దోచుకుని పరారైన సంఘటన అనసూర్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సుమన్ ఫంక్షన్ హాల్ యజమాని యొక్క ఇంటికి అర్ధరాత్రి తమ నివాస గృహంలోకి చొరబడి వారి కుటుంబ సభ్యులను బెదిరించి దాడి చేశారు. తర్వాత ఇంట్లో ఉన్న ఆరు లక్షల రూపాయల నగదు, అరకిలో బంగారాన్ని దోచుకొని అనంతరం పరారయ్యారు. ఈ దొంగల దాడిలో గాయపడిన అటువంటి ఆయుష, నాజరత్, ఉన్నిసా, తరణంలను ఆస్పత్రికి తరలించారు.