బాలుడిపై మోజు.. భర్తను అమాయకున్ని చేసి?

praveen
ఇటీవలి కాలంలో వావివరసలు మరిచిపోతున్నారు మనుషులు. క్షణకాల సుఖం కోసం ఎన్నో నీచాతి నీచమైన పనులు చేసేందుకు కూడా వెనకాడటం లేదు మ్ ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. కట్టుకున్న వారి కళ్లుగప్పి పరాయి వ్యక్తుల మోజులో పడి చివరికి కాపురాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు ఎంతమంది. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది   వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఓ మహిళ ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసేందుకు కూడా వెనకాడలేదు.

 ఓ మైనర్ బాలుడు మోజులో పడిపోయిన ఆ మహిళ ఏకంగా అతనితో రాసలీలలు కొనసాగించడం మొదలు పెట్టింది. కానీ  తాము విచ్చలవిడిగా ఎంజాయ్ చేయడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది.  ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి ఇక భర్తను హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గ్రామీణ మండలానికి చెందిన పోచారం లో జరిగింది ఈ ఘటన. ఇటీవలే భూక్యా మంగీలాల్ అనే వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... చిట్టి రామవరం తండాకు చెందిన మాధవి అదే ప్రాంతానికి చెందిన మేకలు కాసే బాలుడితో గతంలో పరిచయం ఉంది.


 అయితే ఆ బాలునితో చనువుగా మాట్లాడేది మాధవి. ఇక ఆ తర్వాత ఇటీవలే మంగీలాల్ తో మాధవి కి పెళ్లి జరిగింది. ఇక అప్పుడప్పుడు పుట్టింటికి వచ్చినప్పుడు ఆ బాలుడితో చనువు గా మాట్లాడేది. చివరికి వీరి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పుడప్పుడు ఇక మాధవి సోదరి అయిన చిట్టమ్మ ఇంట్లో ఇద్దరు శారీరకంగా కలుసుకునే వారు. ఇక ఏదో కారణం చెప్పి భర్తను అమాయకున్ని చేసి  ఇక పుట్టింట్లోనే ఉండేది  భార్య. ఇక తరచు కారణాలు చెప్పడం మాధవికి నచ్చలేదు. ఇక తన ప్రియుడితో కలిసేందుకు భర్త అడ్డు వస్తున్నాడు అని భావించింది. ప్రియుడు అతని స్నేహితుడు సోదరి చిట్టెమ్మ తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. ఇక ఆ తర్వాత మాధవి ప్రియుడు ఆమె భర్తల మాటల్లో పెట్టి అడవిలోకి తీసుకొని  వెళ్లి మద్యం తాగించి ఆ తర్వాత దారుణంగా కొట్టి చంపేశారు   ఇక కొన్నాళ్ళకి పోలీసులకు శవం లభ్యమైంది. ఇక తనదైన శైలిలో విచారించడంతో భార్య అసలు నిజం ఒప్పుకొంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: