కొడుకు ప్రాణం తీసిన అక్రమసంబంధం..!
తాజాగా తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఓ తల్లి ఏకంగా తన కుమారుడిని చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక తన కుమారుడిని తన అక్రమ సంబంధం బయటపడుతుందనే కారణంగా చంపేసిందనే విషయం వెలుగులోకి రావడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టిందంటే ఎలాంటి ప్లాన్ వేసిందో ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలోని విరంగం గ్రామానికి చెందిన హార్ధిక్ పటేల్ అనే 8 ఏళ్ల బాలుడు 2018 సెప్టెంబర్ నుండి కనిపించడం లేదు. ఇక ఇంటి నుంచి స్వీట్లు కొనుక్కునేందుకు బయటకు వెళ్లిన తన కుమారుడు.. మళ్లీ తిరిగిరాలేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. తాజాగా ఆ బాలుడిని అతడి తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె బావ చంపాడని పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే అతడిని విచారించగా.. మృతుడి తల్లితో అతడికి వివాహేతర సంబంధం ఉందనే విషయం బయటికి వచ్చింది.
ఇక తమ సంబంధం తమ కుమారుడికి తెలిసిపోవడం.. అతడు ఎక్కడ ఈ విషయాన్ని అతడి తండ్రికి చెబుతాడేమో అనే భయంతో.. అతడి తల్లి, బావ కలిసి బాలుడిని చంపేందుకు ప్లాన్ చేశారంట. అంతేకాదు.. బాలుడిని అతడి తల్లి బావ ఓ ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లి చంపేశాదంట. ఇక అక్కడే అతడిని పూడ్చిపెట్టాడు. ఆ తరువాత కొన్నాళ్లకు అతడి అస్థికలను ఓ మురికికాల్వలో పడేశారు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయం బయటకు వచ్చినట్లు తెలిపారు. దాంతో బాలుడి తల్లి, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆమె బావను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కి తరలించారు.