భయం తీసిన ప్రాణం.. అసలు ఏం జరిగిందంటే..!

N.ANJI
వారిద్దరూ కవల పిల్లలు.. చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ, ఇష్టం. ఒక్కరిని విడిచి మరొక్కరు ఎటు వెళ్ళలేదు. ఇక చిన్నప్పటి నుండి ఒకే చోట పెరిగిన వీరు.. జీవితాంతం ఇలాగే ఉండాలని అనుకున్నారు. ఇక వారిద్దరికీ పెళ్లి వయస్సు వచ్చింది. పిల్లలు పెద్దగా ఎదగడంతో తల్లిదండ్రులు వారికీ సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఇక పెళ్లి చేసుకుంటే తాము విడిపోతామనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు వారిద్దరూ.. ఈ విషాద ఘటన కర్ణాటకలోని మండ్యలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని మండ్యలోని శ్రీరంగపట్నం తాలుకాలోని మన్సహల్లి గ్రామానికి చెందిన సురేష్, యశోద దంపతులకు కవల పిల్లలు పుట్టారు. ఇక ఇద్దరు కూతుళ్లు దీపిక, దివ్యని అపురూపంగా పెంచుకున్నారు. అయితే వీరిద్దరు చిన్నతనం నుంచే దీపిక, దివ్యలకు ఒకరంటే మరోకరికి చాల ఇష్టం. ఇక చిన్నప్పటి నుండి దీపిక, దివ్యలు ఒకే స్కూల్, ఒకే రకమైన దస్తులు.. ఇలా అన్నింటికి అలవాటు పడ్డారు. అంతేకాదు.. వారిద్దరి మధ్య మంచి చక్కటి అనుబంధం ఏర్పడింది. ఇక జీవితాంతం కూడా అలాగే ఉండాలని దీపిక, దివ్య కలలు కన్నారు.
ఇక వీరిద్దరికి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే వీరిని వేర్వేరు కుటుంబాలను చెందిన వారికి వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఇక పెళ్లిళ్లు అయ్యాక వేర్వేరు ఇళ్లకు వెళ్లాల్సి వస్తుందని దీపిక, దివ్యలు తీవ్ర మనస్తాపానికి గురైయ్యారు.తల్లిదండ్రులు అనుకున్నట్లు జరిగితే తమ మధ్య ఎడబాటు తప్పదని భావించారు. ఆ తరుణంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి ఇద్దరు ఉరి కొయ్యలకు వేలాడుతూ కనిపించారు. ఇక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వీరిద్దరి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: