కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది . రోజుకు లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తల్లిదండ్రులను లేకుండా చేసి పిల్లలను అనాథలుగా మారుస్తుంది. ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన కరోనా తాజాగా ఓ చంటి బిడ్డకు తల్లి ప్రేమను దూరం చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన తొమ్మిది నెలల గర్భిణీ ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించడం మొదలు పెట్టారు. అదే సమయంలో లో పురిటి నొప్పులు రావడంతో ఆపరేషన్ చేసి బిడ్డను క్షేమంగా భయటకు తీశారు. తల్లికి కరోనా ఉన్నప్పటికీ బిడ్డకు నెగిటివ్ వచ్చింది. దాంతో బిడ్డను చూసుకుని తల్లి ఎంతో ఆనంద పడింది. కానీ ఆ ఆనందం ఎక్కువరోజులు మిగల్లేదు. ఒక్కరోజులోనే విషాదంగా మారింది .
ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖపట్నానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణీకి 10 రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ కేజీహెచ్ లో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆ మహిళకు వెంటిలేటర్ పై చికిత్స అందించడం మొదలుపెట్టారు. అంతలోనే పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు పద్మలీల ఆపరేషన్ చేసి బిడ్డను క్షేమంగా భయటకు తీశారు. అయితే తల్లికి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ బిడ్డకు నెగిటివ్ వచ్చింది. బిడ్డ క్షేమంగా భయట పడటంతో అంతా కుటుంబం అంతా సంతోషపడ్డారు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తరవాత రోజే తల్లి కన్ను మూసింది. దాంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది.కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది. రోజుకు లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తల్లిదండ్రులను లేకుండా చేసి పిల్లలను అనాథలుగా మారుస్తుంది. ఇప్పటికే ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన కరోనా తాజాగా ఓ చంటి బిడ్డకు తల్లి ప్రేమను దూరం చేసింది. కరోనా పాజిటివ్ వచ్చిన తొమ్మిది నెలల గర్భిణీ ఆస్పత్రిలో చేరింది . ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించడం మొదలు పెట్టారు. అదే సమయంలో లో పురిటి నొప్పులు రావడంతో ఆపరేషన్ చేసి బిడ్డను క్షేమంగా భయటకు తీశారు. తల్లికి కరోనా ఉన్నప్పటికీ బిడ్డకు నెగిటివ్ వచ్చింది. దాంతో బిడ్డను చూసుకుని తల్లి ఎంతో ఆనంద పడింది. కానీ ఆ ఆనందం ఎక్కువరోజులు మిగల్లేదు. ఒక్కరోజులోనే విషాదంగా మారింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది . పూర్తి వివరాల్లోకి వెళితే... విశాఖపట్నానికి చెందిన తొమ్మిది నెలల గర్భిణీకి 10 రోజుల కిందట కరోనా పాజిటివ్ వచ్చింది . దాంతో కుటుంబ సభ్యులు ఆమెను విశాఖ కేజీహెచ్ లో ఆస్పత్రిలో చేర్పించారు . అయితే ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు ఆ మహిళకు వెంటిలేటర్ పై చికిత్స అందించడం మొదలుపెట్టారు . అంతలోనే పురిటి నొప్పులు రావడంతో వైద్యురాలు పద్మలీల ఆపరేషన్ చేసి బిడ్డను క్షేమంగా భయటకు తీశారు . అయితే తల్లికి కరోనా పాజిటివ్ ఉన్నప్పటికీ బిడ్డకు నెగిటివ్ వచ్చింది . బిడ్డ క్షేమంగా భయట పడటంతో అంతా కుటుంబం అంతా సంతోషపడ్డారు . అయితే బిడ్డకు జన్మనిచ్చిన తరవాత రోజే తల్లి కన్ను మూసింది . దాంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది. ఈ విషాద ఘటన అందరినీ కలచివేసింది .