హత్య కేసు పక్కపెట్టిన పోలీసులు.. ఏం చేశారంటే?

Satvika
మనుషుల మధ్య పగలు ఉండటం సహజం.. కొన్ని కుటుంబ కలహాల వల్ల వస్తే, మరి కొన్ని ప్రాంతీయ ఘటనల వల్ల కలుగుతాయి. ఇప్పుడు పాత కక్ష్యల వల్ల నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే.. మిర్యాలగూడ రూరల్‌ మండలం తుంగపాడ్‌ గ్రామానికి చెందిన మచ్చ అంజయ్య కుమారుడు మచ్చ శ్రీకాంత్‌ తన అమ్మమ్మ బొల్లేపల్లి నర్సమ్మ దశదిన కార్యానికి నిడమనూరు మండలం రేగులగడ్డకు గురువారం వచ్చాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యాక తిరుగు ప్రయాణం అయ్యాడు. 


ఈ క్రమంలో తన మేనత్త, మేన మామ లను బండి పై ఎక్కించుకొని బస్టాండ్ కు బయలు దేరాడు.పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన సమీప బంధువు వంగూరి మహేందర్‌తోపాటు మరో నలుగురు వ్యక్తులు సుమోలో వెంబడిస్తూ నారమ్మగూడెం సమీపంలోకి రాగానే బైక్‌ను ఢీ కొట్టారు. దాంతో ముగ్గురు కింద పడ్డారు. కాగా, పక్కన పడి ఉన్న శ్రీకాంత్ కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో, గొడ్డలితో దాడి చేశారు.వరి పంట కోసిన మడిలో నీరు ఉండడంతో అందులో పడేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారని ఎస్‌ఐ తెలిపారు. తుంగతుర్తిలో ఉన్న భూమిలో అధిక భాగం మచ్చ శ్రీకాంత్‌కు పట్టా చేస్తానని అమ్మమ్మ బొల్లేపల్లి నర్సమ్మ గతంలో చెప్పిందని.. దానిని మనసులో ఉంచుకుని సమీప బంధవులే దారుణానికి పాల్ప డినట్లు అనుమానిస్తున్నారు.


శ్రీకాంత్ అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి కి తరలించారు. ఇది ఇలా ఉండగా అక్కడకు చేరుకున్న పోలీసులు మద్య వాగ్వాదం చోటు చేసుకుంది.. హత్యా జరిగిన స్థలం నిడమనూరు, త్రిపురారం మండలాల శివారులో ఉంది. ఈక్రమంలో హత్యా ప్రదేశానికి చేరుకున్న ఇరు మండలాల పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతం మీదంటే మీదే అంటూ వాదించుకున్నారు. అన్నారావు క్యాంపు త్రిపురారం మండల పరిధిలో ఉండడంతో పక్కనే పొలాల్లో హత్య జరిగింది. మీ పరిధిలోకి వస్తుంది అంటూ వాదించుకోని, చివరికి ఒకరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికులకు ఆగ్రహాన్ని కలిగించింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: