బిడ్డ మరణం.. భర్తకు ఫోన్.. అనుమానంతో కేసు.. అసలు ఏం జరిగిందంటే..!
అయితే ప్రియురాలితో హ్యాపీగా గడుపుదామనుకున్న రాజుకు ఆ ఏడాదిన్నర బాబు అడ్డుగా కనిపనించాడు. దీంతో ఆ బాబును అడ్డు తొలగించుకుందామనుకున్నాడు. సమయం కోసం వేచి చూశాడు. రాజు వాషింగ్ మెషీన్ టెక్నిషియన్ గా పనిచేసేవాడు. ఆమె క్యాటరింగ్ పనికి వెళ్లేది. ఈ క్రమంలోనే మార్చి 28న బాబును రాజుకు అప్పగించి ఆమె క్యాటరింగ్ కు వెళ్లింది.
ఇక కొన్ని గంటల తర్వాత ఆమెకు రాజు ఫోన్ చేశాడు. ‘బాబు వాంతి చేసుకున్నాడు. బాగా ఏడుస్తున్నాడు. నేను ఆస్పత్రికి తీసుకెళ్తున్నాను. నువ్వు కూడా త్వరగా రా’ అంటూ ఫోన్ చేసి చెప్పాడు. దీంతో హుటాహుటిన ఆమె రాజు వద్దకు వెళ్లింది. ఆమె అక్కడకు చేరుకునేసరికే ‘రెండు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకుండా పోయింది. బాబు చనిపోయాడు.’ అంటూ చెప్పి బోరున విలపించాడు. ఆమె నిజమేనని నమ్మింది. బాబుకు ఆరోగ్యం బాగాలేక చనిపోయాడని భర్తకు ఫోన్ చేసి చెప్పింది.
అయితే ఆ భర్తకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి, విచారణ ప్రారంభించారు. ఆమె ప్రియుడితో ఉంటున్నట్టు గుర్తించారు. ప్రియుడు రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు నిజం కక్కాడు. ’బాబుకు బాగా పాలు పట్టించాను. ఆ తర్వాత విపరీతంగా కొట్టాను. కడుపులోనూ, మాడు మీద కొట్టాను. ఏడ్చీ ఏడ్చీ ఆ బాబు మరణించాడు. మరణించిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్టు ప్రేయసితో నాటకం ఆడాను’ అని రాజు నిజం ఒప్పుకున్నాడు. దీంతో అసలు నిజం తెలిసి ఆ భార్యాభర్తలు కంగుతిన్నారు. రాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.