ప్రియుడికి ఫోన్ చేస్తున్న భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. చివరికి..!

N.ANJI
నేటి సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా చాల మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు పురుషులు క్రూరంగా వ్యవహరిస్తే.. మరికొన్ని సందర్భాల్లో మహిళలు కూడా అంతే కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి ఓ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఖుషినగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు కూడా షాకైయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన మహిళతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడిని నాలుగు నెలల క్రితం పెళ్లి అయ్యింది. అయితే తన భార్య తనను మోసం చేస్తూ ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అతడికి అనుమానం వచ్చింది. ఈ విషయంలో భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె భర్త.. ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా గుర్తించాడు. దీంతో వారి మధ్య గొడవ మొదలైంది.
అయితే ఇలాంటివి మానుకోవాలని భర్త సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో.. భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన పుట్టింటికి చేరుకుంది. అయితే కొద్దిరోజులకే భార్యను తీసుకురావడానికి పుట్టింటికి వెళ్లాడు ఆమె భర్త. అయితే అక్కడ కూడా ఆమె ప్రవర్తన మారలేదు. తన దగ్గర ఉన్న సమయంలో ఏ విధంగా వ్యవహరించిందో అక్కడ కూడా అలాగే వ్యవహరించడం మొదలుపెట్టింది. దీంతో భార్య పుట్టింట్లో కూడా భర్త ఆమెతో గొడవపడ్డాడు. దీంతో అత్తమామలు అతడిని వారించారు. వివాదాన్ని తాము పరిష్కరిస్తామని.. అప్పటివరకు తమ ఇంట్లోనే ఉండాలని కోరారు.
ఇక భార్యతో కాకుండా మరో గదిలో ఉండాలని సూచించారు. దీంతో అతడు వాళ్లు చెప్పినట్టు విన్నాడు. అయితే భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన అతడి భార్య.. అర్థరాత్రి సమయంలో క్రూరమైన చర్యకు పాల్పడింది. అంతా పడుకున్న సమయంలో భర్త గదికి వెళ్లింది. తనతో పాటు తెచ్చుకున్న బ్లేడుతో భర్త మర్మాంగాన్ని కోసేసింది. దీంతో అతడు గట్టిగా అరిచాడు. వెంటనే తేరుకున్న అతడి అత్తమామలు.. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: