సంక్రాంతి స్పెషల్: ఎన్ని రకాల పిండి వంటలో.. తిని రుచి చూసేయండిలా..?
సకినాలు:
ముందుగా బాగా కడిగిన బియ్యాన్ని ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత బయట క్లాత్‌పై గంటపాటు ఆరబెట్టాలి. బాగా ఆరిన తర్వాత మిక్సిలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, నువ్వులు, వాము, జీలకర్ర, నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత సకినాలు షేపులో వేసుకుని కొంచెం సేపు ఆరబెట్టాలి. కొంచెం ఆరిన తర్వాత ఆయిల్లో వేయించుకోవాలి. క్రిస్పీగా ఉండే సకినాలు రెడీ.
నువ్వుల ఉండలు:
నువ్వుల్లో కాల్షియం ఎక్కువ. నువ్వులు తింటే ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. ఒక కప్పు నువ్వు, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. స్టవ్‌పై ప్యాన్‌లో నువ్వులను బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బయటకు తీసుకోవాలి. వేరో ప్యాన్‌లో 2 టీస్పూన్ నెయ్యి తీసుకుని, అందులో బెల్లం వేసుకుని కరిగించాలి. ఆ తర్వాత అందులో అర టీస్పూన్ యాలాకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక.. వేయించిన నువ్వులు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని ప్లేట్లో తీసుకుని 5 నిమిషాల తర్వాత చేతికి నెయ్యి రాసుకుని లడ్డు షేప్‌లో చేసుకోవాలి.
జంతికలు:
ప్రతి పండుగ స్పెషల్ వంటకం జంతికలు. ఒక బౌల్లో రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులోనే ముప్పావు కప్పు శనగ పిండిని వేసుకోవాలి. వాము, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ కారం, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత జంతికల గొట్టాన్ని తీసుకుని జంతికలు తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నూనెలో వేయించుకోవాలి. పండుగ వేళ మీరు కూడా ఇంట్లో ఈ పిండి వంటలను ట్రై చేయండి.