చలికాలంలో వేడి వేడి టీతో పాటు స్పైసీ స్నాక్స్‌ను తినడానికి సరదాగా ఉంటుంది. తరచుగా ఈ సీజన్‌లో స్పైసీ ఫుడ్‌ను తినేందుకు ఇష్టపడతారు. ప్రజలు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం టీతో పాటు ఫ్రై, స్పైసీ ఫుడ్ తీసుకోవాలని కోరుకుంటారు. మరోవైపు చిరు తిండి కోసం చలిలో వంటగదిలో ఎక్కువ సమయం గడపడానికి ఎవరూ ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో మీరు ఇలాంటి అనేక రుచికరమైన వంటకాల కోసం చూస్తుంటే... అవి సులభంగా, త్వరగా తయారు చేయబడతాయి. అయితే వేడి వేడి టీతో మసాలా తగిలితే రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా ఉదయపు అల్పాహారంలో త్వరగా చేయాలని ఆలోచిస్తుంటే, ఈ స్నాక్స్ ప్రయత్నించండి. దీనితో పాటు మీకు రుచికరమైన ఆరోగ్యకరమైన, స్పైసీ బ్రేక్ ఫాస్ట్ వంటకాలను కూడా వండుకోవచ్చు. పనీర్ పకోడా, వెజిటబుల్ పోహా, మేతి పాలక్, పకోడా వంటివి చేసుకోవచ్చు. తద్వారా మీరు ఉదయం లేదా సాయంత్రం అల్పాహారం టీతో ప్రతి ఒక్కరి నోటి రుచిని పెంచవచ్చు. ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం మేథీ తేప్లా పరాటా రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం.
మేథీ తేప్లా పరాటా కోసం కావలసినవి:
రెండు కప్పుల మైదా, మెంతులు, నూనె, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, పంచదార, పెరుగు.
మేథీ తేప్లా పరాటా చేయడానికి రెసిపీ
పొడి మెంతులు, ఉప్పు, సన్నగా తరిగిన పచ్చి కొత్తిమీర, పంచదార, కొద్దిగా నూనెను పిండిలో కలపండి. దానికి అల్లం, వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి పేస్ట్ జోడించండి. పెరుగు ద్వారా పిండిని బాగా మెత్తగా కలపండి. ఇప్పుడు దానిని మేథీ తేప్లా పరాటాలా వత్తుకోండి. తరువాత వాటిని వేడి వేడి పాన్ పై నెయ్యితో కాల్చండి. అంతే మేతి తేప్లా సిద్ధంగా ఉంది. చలిలో వేడివేడిగా స్పైసీ బ్రేక్ ఫాస్ట్ మెంతి తేప్లా పరాటా రెడీ !