బ్రెడ్ బొండాలను ఎప్పుడన్నా ట్రై చేసారా.?

Suma Kallamadi
ప్రతి రోజు ఒకేలాంటి వంటలు కాకుండా కాస్త వెరైటీగా ఏదన్నా ట్రై చేసి చూడండి. ఇంట్లోని పిల్లలతో సహా పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే రెసిపీని మార్నింగ్ పూట టిఫిన్ కింద అయినా తినవచ్చు.ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. ఇండియా హెరాల్డ్ వారు మీకోసం బ్రెడ్ తో ఒక వెరైటీ రెసిపీని మీ ముందుకు తీసుకుని వచ్చారు.మరి ఆలస్యం చేయకుండా ఆ రెసిపీ ఏంటో ఒకసారి చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
బ్రెడ్‌స్లైసులు: పన్నెండు
బంగాళాదుంపలు: మూడు
ఉల్లిపాయ: ఒకటి
నానబెట్టిన సెనగలు: కొన్ని
కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు,
జీలకర్ర: ఒక చెంచా
కారం: ఒక చెంచా
గరంమసాలా: అరచెంచా
పసుపు: పావుచెంచా
ఉప్పు: తగినంత
నూనె: వేయించేందుకు సరిపడా.
తయారు చేసే విధానం :
ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో కొద్దిగా  సెనగలు, బంగాళాదుంపలు, కొద్దిగా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చే దాక ఉడికించుకుని తీసుకోవాలి. ఆ తరువాత బంగాళాదుంపలు పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కల్ని వేయించాలి. అందులోనే ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, సెనగల్ని వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కూరలాగా అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి.కూర చల్లారిన తరువాత చేతితో చిన్న చిన్న ఉండల్లాగా  చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్‌స్లైసును తీసుకుని దాని అంచుల్ని చాకుతో తీసేసి నీళ్లల్లో ఒకసారి ముంచి తీసి, అందులో ముందుగా చేసుకున్న బంగాళాదుంప ఉండను ఉంచి అంచులు మూస్తూ బోండంలా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్నీ ఉండలను చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో సరిపడా నూనె పోసి నూనె కాగిన తరువాత బ్రెడ్ బోండాలను రెండు మూడు చొప్పున కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని  తీసుకోవాలి. ఇదే పద్దతిలో మిగతా బోండాలను కూడా ఎర్రగా వేపుకోవాలి. అంతే బ్రెడ్ బొండాలు రెడీ అయినట్లే. వీటిలోకి పల్లి చట్నీ గాని, టొమోటో చట్నీ గాని వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: