చామ దుంపలతో ఎప్పుడన్నా ఇలా ఫ్రై చేసారా.?

Suma Kallamadi
చాలా మందికి చేమ దుంపలతో పులుసు పెట్టడం తెలుసు. .ఎందుకంటే చేమ దుంపలు జిడ్డు స్వభావాన్ని కలిగి ఉంటాయి. వేపుడు చేస్తే రుచి బాగోదు అనే ఉద్దేశంతో చాలామంది పులుసు పెడతారు.కానీ చేమదుంపలతో  ఫ్రై కూడా చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు.అందుకే ఈరోజు ఇండియా హెరాల్డ్ వారు చేమదుంపలతో కర కర లాడే ఫ్రై ఎలా చేయాలో మీకు వివరించబోతున్నారు. ఈ ఫ్రై తినడానికి చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే ఫ్రై చేస్తారు. మరి ఆలస్యం చేయకుండా చేమ దుంపలతో ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. !
కావలిసిన పదార్ధాలు :
250 gms చేమదుంపలు
3 tbsp బియ్యం పిండి
1/4 spoon పసుపు
1 tsp కారం
ఉప్పు
నూనె- వేయించడానికి సరిపడా
3 దంచినవి వెల్లూలి
కరివేపాకు- ఓ రెబ్బ
1/2 tsp ఆవాలు, జీలకర్ర, మినపప్పు
2 ఎండు మిర్చి
1 tsp సాంబార్ కారం/కూర కారం
తయారీ విధానం :
ముందుగా చేమదుంపల్ని శుభ్రంగా కడిగి కుక్కర్ లో పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక రెండు విజిల్స్ వచ్చే దాక ఉంచండి. గుర్తుంచుకోండి ఎక్కువ విజిల్స్ వస్తే దుంప మెత్తగా అయిపోతుంది. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ అఫ్ చేయాలి. చల్లారాక  దుంపల పొట్టు తీయాలి.ఇప్పుడు
ఉడికిన్చుకున్న దుంపల్ని అర అంగుళం ముక్కలుగా రౌండ్ గా కట్ చేసుకోండి.  ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో సగం బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు వేసి చిదిరిపోకుండా నెమ్మదిగా కలపండి. తరువాత
మిగిలిన బియ్యం పిండి, కొద్దిగా నూనె వేసి దుంపలకి మళ్ళీ పట్టించండి. దీని వల్ల మరింత కరకరలాడుతూ వస్తాయి.ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి నూనె పోయండి. ఈ వేడి వేడి నూనె లో చేమగడ్డ ముక్కలు వేసి కదపకుండా 2 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత నెమ్మదిగా కదుపుతూ మీడియం ఫ్లేం మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోండి.ఆ తరువాత హై ఫ్లేం మీద ఎర్రగా కరకరలాడేలా బంగారు రంగు వచ్చేదాకా వేపుకుంటే చాలు.అన్ని అలానే వేపుకున్న తరువాత తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు దినుసులు అన్ని వేసి వేయించుకుని వేపుకున్న దుంపలు వేసి పైన సాంబార్ కారం వేసి ఒకసారి కలిపి రెండు నిముషాలు అయ్యాక దింపేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: